Telugu Global
Cinema & Entertainment

Dasara Movie: దసరా సినిమా రెండు భాగాలుగా వస్తోందా?

Nani's Dasara movie - నాని హీరోగా నటిస్తున్న సినిమా దసరా. ఈ మూవీ 2 భాగాలుగా వస్తుందనే టాక్ నడుస్తోంది. అది నిజమేనా?

Dasara Movie: దసరా సినిమా రెండు భాగాలుగా వస్తోందా?
X

హీరో నాని నుండి రాబోతున్న పాన్ ఇండియా మూవీ ‘దసరా’. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. నాని కెరీర్ లోనే డిఫరెంట్ మూవీగా దసరా తెరకెక్కుతుంది. ఇప్పుడీ సినిమాపై కొత్త ప్రచారం ఊపందుకుంది.


ఈమధ్య ప్రతీ సినిమాకు జరుగుతున్నట్టే దసరా కి కూడా ఓ ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా పార్ట్ 2 కూడా వస్తుందనేది ఆ ప్రచారం. బాహుబలి, పుష్ప తరహాలో దసరాను కూడా రెండు భాగాలుగా రిలీజ్ చేస్తారంటూ కథనాలు రావడం మొదలయ్యాయి.


దీంతో ఈ విషయంపై నాని క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశాడు. జస్ట్ వన్ అంటూ దసరా కి రెండో పార్ట్ లేదని క్లారిటీ ఇచ్చేశాడు. కాకపోతే దసరాలో డబుల్ పవర్ ఉంటుందనే హింట్ ఇచ్చాడు. నాని ఇచ్చిన క్లారిటీతో దసరా రెండు భాగాలుగా రాదని ఒకే ఒక్క భాగంగా రానుందని ఆడియన్స్ కి క్లారిటీ వచ్చేసింది.


నాని సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. శ్రీ లక్ష్మి వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్న ఈ సినిమా 5 భాషల్లో మార్చి 30 న రిలీజ్ కానుంది.

First Published:  27 Jan 2023 2:06 PM GMT
Next Story