Telugu Global
Cinema & Entertainment

Chiranjeevi: కోలీవుడ్ డైరెక్టర్ తో మెగాస్టార్ చిరంజీవి సినిమా చేస్తారా?

Chiranjeevi: తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పా రంజిత్ తెలుగులో కూడా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు అని సమాచారం.

Megastar Chiranjeevi
X

మెగాస్టార్ చిరంజీవి

ఈ మధ్యనే "గాడ్ ఫాదర్" సినిమాతో ప్రేక్షకులను అలరించిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఇప్పుడు "వాల్తేరు వీరయ్య" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

అయితే తాజాగా ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ పా రంజిత్ దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో పా రంజిత్ తెలుగులో కూడా డైరెక్టర్ గా పరిచయం కాబోతున్నారు అని సమాచారం. ఇక ఈ విభిన్న కాంబినేషన్ పై ప్రేక్షకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కమర్షియల్ సినిమాలు కి దూరంగా ఉండే డైరెక్టర్లలో పా రంజిత్ కూడా ఒకరు. ఇప్పటిదాకా ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ఆఫ్ బీట్ సినిమాలు. మరోవైపు మెగాస్టార్ ఒక పక్కా మాస్ మసాలా కమర్షియల్ హీరో. అలాంటిది వీరిద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో అని అభిమానులు అనుకుంటున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ సినిమా లో నటించే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. "ఆచార్య" సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరంజీవి ఇకపై పెద్దగా రిస్క్ లు తీసుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆఫ్ బీట్ సినిమాల కంటే కమర్షియల్ సినిమాలే బెటర్ అని చిరు అనుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సమయంలో చిరంజీవి పా రంజిత్ కి ఓకే చెప్పే అవకాశం లేదని కొందరు చెబుతున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి "భోళా శంకర్" అనే సినిమాలో కూడా నటిస్తున్నారు.

First Published:  23 Dec 2022 11:21 AM GMT
Next Story