Telugu Global
Cinema & Entertainment

Animal Movie | యానిమల్ ఆ ఘనత సాధిస్తుందా..?

Animal Movie - యానిమల్ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరుతుందా.. ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది.

Animal Movie | యానిమల్ ఆ ఘనత సాధిస్తుందా..?
X

రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. బాలీవుడ్ బిగ్గెస్ట్ ఓపెనర్స్ లో ఒకటి. ఈ ఏడాది బాలీవుడ్ లో భారీ హిట్స్ లో కూడా చోటు సంపాదించుకుంది. ఇన్ని ఘనతలు సాధించిన యానిమల్ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు సాధిస్తుందా? ఈ ప్రశ్నకు మాత్రం కష్టమనే సమాధానం వినిపిస్తోంది ట్రేడ్ నుంచి.

రణబీర్ కపూర్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటించిన యానిమల్ సినిమా రికార్డ్ వసూళ్లతో దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 660 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. ఇదే ఊపులో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందని అనుకుంటున్నారు చాలామంది. కానీ సాధ్యం కాదంటోంది ట్రేడ్.

యానిమల్ రిలీజై ఇప్పటికే 9 రోజులు గడిచింది. ఆల్రెడీ 2 వీకెండ్స్ ముగిశాయి. ఇవాళ్టి నుంచి ఈ సినిమాకు ఆక్యుపెన్సీతో కూడా వసూళ్లు కూడా తగ్గడం ఖాయం. కాబట్టి ఇప్పటివరకు చూసిన స్థాయిలో వసూళ్లు రావడం కష్టం.

మరీ ముఖ్యంగా యానిమల్ సినిమా సౌత్ లో ఫ్లాప్ అయింది. తెలుగులో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో వసూళ్లు వచ్చినప్పటికీ, షారూక్ నటించిన జవాన్ తో పోల్చి చూస్తే యానిమల్ కు కలెక్షన్లు తక్కువే. ఇక తమిళ్, కన్నడలో ఈ సినిమాకు చాలా తక్కువగా వసూళ్లు వస్తున్నాయి. మలయాళంలో ఈ మూవీ డిజాస్టర్ అయింది. సో.. కేవలం హిందీ వెర్షన్ తోనే యానిమల్ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరాల్సి ఉంటుంది.

దీనికితోడు రణబీర్ కపూర్ సినిమాకు ఇప్పుడు చాలా తక్కువ టైమ్ ఉంది. ఇంకా చెప్పాలంటే కేవలం 9-10 రోజులు మాత్రమే సమయం ఉంది. ఎందుకంటే, ఆ తర్వాత షారూక్ నటించిన డంకీ, ప్రభాస్ చేసిన సలార్ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.

ఈ రెండు సినిమాలు రిలీజైతే, యానిమల్ సినిమా భారీ స్థాయిలో స్క్రీన్స్ కోల్పోవాల్సి ఉంటుంది. కాబట్టి, యానిమల్ సినిమాకు ఉన్నది ఈ 10 రోజులు టైమ్ మాత్రమే. ఉన్న ఈ 10 రోజుల్లో ఈ సినిమా ఇంకా 340 కోట్ల రూపాయల గ్రాస్ సాధించాల్సి ఉంది. ట్రేడ్ అంచనా ప్రకారం, యానిమల్ వసూళ్లు 930 కోట్ల రూపాయల రేంజ్ లో ఆగిపోవచ్చు.

First Published:  11 Dec 2023 4:45 PM GMT
Next Story