Telugu Global
Cinema & Entertainment

Ambajipeta | అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ లో వెంకటేష్ మహా!

Ambajipeta Marriage Band - గీతా ఆర్ట్స్ బ్యాకప్ తో ధీరజ్ నిర్మించిన సినిమా అంబాజిపేట మ్యారేజ్ బ్యాండు. మరి ఈ సినిమాతో దర్శకుడు వెంకటేశ్ మహాకు సంబంధం ఏంటి?

Ambajipeta | అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ లో వెంకటేష్ మహా!
X

దొరసాని, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బేబి వంటి విజయవంతమైన చిత్రాలతో సక్సెస్ ఫుల్ యంగ్ ప్రొడ్యూసర్ గా టాలీవుడ్ లో పేరు తెచ్చుకుంటున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన సుహాస్ హీరోగా జీఏ2 పిక్చర్స్, మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ "అంబాజీపేట మ్యారేజి బ్యాండు". ఈ సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహించారు.

అంతా బాగానే ఉంది కానీ, ఈ సినిమాకు మహాయన మోషన్ పిక్చర్స్-వెంకటేష్ మహాకు సంబంధం ఏంటనేది చాలామంది డౌట్. ఈ డౌట్ కు సమాధానం ఇచ్చాడు నిర్మాత ధీరజ్.

"దుశ్యంత్ వెంకటేష్ మహా దగ్గర కేరాఫ్ కంచెరపాలెం, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య మూవీస్ కు వర్క్ చేశాడు. వెంకటేష్ ను గురువుగా భావిస్తాడు దుశ్యంత్. ఈ సినిమా కథను ఫస్ట్ దుశ్యంత్ వెంకటేష్ మహాకే చెప్పాడు. వెంకటేష్ మహా ప్రొడ్యూస్ చేయాలని అనుకున్నారు. కానీ కోవిడ్ టైమ్ లో రిస్క్ ఎందుకని అనుకున్నారు. ఈ కథ మేము కూడా విన్నాం. మాకు బాగా నచ్చింది. వెంకటేష్ మహాకు మేము ప్రొడ్యూస్ చేసుకుంటాం అని చెప్పాం. ఆయన సరేనన్నారు. వెంకటేష్ మహాను ప్రెజెంటర్ గా ఉంచి మేము నిర్మించాం."

"అంబాజీపేట మ్యారేజి బ్యాండు" సినిమా ఫిబ్రవరి 2న థియేటర్స్ లోకి వస్తోంది. సినిమాలో ఎలాంటి కులాల ప్రస్తావన, కులాల గొడవలు ఉండవంటున్నాడు ఈ నిర్మాత.

First Published:  28 Jan 2024 4:09 PM GMT
Next Story