Telugu Global
Cinema & Entertainment

గాడ్ ఫాదర్ లో సల్మాన్ నటించడానికి కారణం?

గాడ్ ఫాదర్ సినిమాలో నటించడానికి సల్మాన్ ఎందుకు అంగీకరించాడు. దీనిపై స్వయంగా ఆ హీరో స్పందించాడు.

గాడ్ ఫాదర్ లో సల్మాన్ నటించడానికి కారణం?
X

దశాబ్దాలుగా బాలీవుడ్ లో కొనసాగుతున్న సల్మాన్ ఖాన్, సౌత్ సినిమాలో నటించాలని ఎప్పుడూ అనుకోలేదు. తొలిసారి గాడ్ ఫాదర్ సినిమాలో నటించాడు. మరి ఇప్పుడు సల్మాన్ కు ఎందుకు అవసరం వచ్చింది. నిజానికి సల్మాన్ కు ఇప్పుడు కూడా ఓ సౌత్ సినిమాలో నటించాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు గాడ్ ఫాదర్ లో నటించాల్సి వచ్చిందో వివరించాడు ఈ స్టార్.

"చిరంజీవి గారు ఈ సినిమా గురించి చెప్పగానే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను. సినిమాల పట్ల చిరంజీవి గారికి, ఆయన పట్ల నాకున్న ప్రేమ దీనికి కారణం. చిరంజీవి గారితో నటించడం మంచి అనుభవం. ఇందులో చాలా కొత్త పాత్ర చేశాను. మల్టీస్టారర్లు చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మల్టీ స్టారర్ చిత్రాలు చేయడం పరిశ్రమకు మంచిది."

ఇలా గాడ్ ఫాదర్ సినిమాలో నటించడం వెనక రీజన్ ను తెలిపాడు సల్మాన్. రామ్ చరణ్ రిఫరెన్స్ తో మెగాస్టార్ పై ప్రేమతో ఇందులో నటించడానికి సల్మాన్ ఓకే చెప్పినప్పటికీ, రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం చిరంజీవి రాజీ పడలేదు.

ఈ విషయాన్ని పరోక్షంగా అంగీకరించిన సల్మాన్, నార్త్ సౌత్ అనే తేడా లేకుండా ప్రపంచమంతా ఇండియన్ సినిమాను చూస్తోందని, రాబోయే రోజుల్లో మరిన్ని నంబర్స్ పెరుగుతాయని అన్నాడు.

First Published:  2 Oct 2022 10:57 AM GMT
Next Story