Telugu Global
Cinema & Entertainment

Meter Movie - కిరణ్ అబ్బవరంతో 'మాస్' ఎలా?

Kiran Abbavaram Meter Movie - స్టార్ హీరోలు చేయాల్సిన మాస్ మూవీని కిరణ్ అబ్బవరం ఎందుకు చేయాల్సి వచ్చింది. దీనిపై దర్శకుడు వివరణ ఇచ్చాడు.

Meter Movie - కిరణ్ అబ్బవరంతో మాస్ ఎలా?
X

కిరణ్ అబ్బవరం ఓ కొత్త హీరో. ఇప్పటివరకు పూర్తిస్థాయి మాస్ సినిమా చేయలేదు. అలాంటి హీరోతో ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ఎందుకు చేశారు? స్టార్ హీరోలు చేయాల్సిన ఈ కథకు కిరణ్ సెట్ అవుతాడని ఎలా అనుకున్నారు? ఇవే ప్రశ్నలు మీటర్ సినిమా దర్శకుడు రమేష్ కడూరికి ఎదురయ్యాయి.

"మన దగ్గర ఏముందో దానితోనే గెలవాలి. ఈ కథ తో ఇద్దరు ముగ్గురు హీరోలని సంప్రదించాను. అయితే అప్పటికే వాళ్ళు చేయాల్సిన ప్రాజెక్ట్ లు ఉండటం, ఇంకొన్ని కారణాల వలన కుదరలేదు. అలా అని ఉండిపోతే నా కెరీర్ ఆగిపోతుంది. అందుకే ఎవరిని పట్టుకున్న మనం అనుకున్నట్లు చూపించాలని నిర్ణయించుకున్నాను. అప్పడే ఎస్ఆర్ కళ్యాణ మండపం తో వచ్చాడు కిరణ్. నిర్మాతలు కూడా ఆ సినిమాని చూశారు. ఈ కథ అతనికి పడితే బావుంటుందని ఫీలయ్యారు. వెళ్లి కథ చెబితే ఓకే చేశాడు. ఓకే చేసిన తర్వాత ఇంక అలోచించలేదు."

ఇలా మీటర్ సినిమా వెనక మేటర్ బయటపెట్టాడు దర్శకుడు రమేష్. తను కొంతమంది స్టార్ హీరోల్ని ప్రయత్నించి విఫలమైన, తప్పనిసరి పరిస్థితుల్లో కిరణ్ తో మీటర్ సినిమా చేయాల్సి వచ్చిందనే విషయాన్ని బయటపెట్టాడు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు రమేష్. ఇక ఇదే సినిమాతో కోలీవుడ్ భామ అతుల్య రవి, టాలీవుడ్ కు పరిచయమౌతోంది. 7న రిలీజ్ అవుతోంది మీటర్ మూవీ.

First Published:  1 April 2023 5:35 PM GMT
Next Story