Telugu Global
Cinema & Entertainment

Dil Raju - శాకుంతలం ప్రాజెక్టులో అందుకే చేరాను

Dil Raju - శాకుంతలం ప్రాజెక్ట్ లోకి దిల్ రాజు ఎందుకు ఎంటర్ అయ్యారు. స్వయంగా ఆయనే వివరణ ఇచ్చారు.

Dil Raju - శాకుంతలం ప్రాజెక్టులో అందుకే చేరాను
X

శాకుంతలం సినిమా విడుదలకు రెడీ అవుతోంది. సమంత లీడ్ రోల్ పోషించిన ఈ సినిమాలోకి దిల్ రాజు వచ్చిచేరిన సంగతి తెలిసిందే. అయితే డబ్బులు పెట్టడం కోసమే దిల్ రాజు వచ్చాడని చాలామంది అనుకున్నారు. భారీ బడ్జెట్ కాబట్టి, గుణశేఖర్ కు సపోర్ట్ గా నిలిచేందుకు దిల్ రాజు వచ్చాడని అంతా అనుకున్నారు.


కానీ దిల్ రాజు వెర్షన్ మరోలా ఉంది. గుణశేఖర్ కు హెల్ప్ చేయడం కోసం ఈ ప్రాజెక్టులోకి ఎఁటర్ అవ్వలేదంటున్నాడు దిల్ రాజు. గ్లోబల్ సినిమా గురించి తెలుసుకునేందుకు, కొత్త విషయాలు నేర్చుకునేందుకు మాత్రమే శాకుంతలం ప్రాజెక్టులోకి వచ్చానని చెబుతున్నాడు.


"అంద‌రూ నేను గుణశేఖ‌ర్‌ కి హెల్ప్ చేయ‌టానికి ఈ సినిమాలో జాయిన్ అయ్యాన‌ని అనుకున్నారు. కానీ నేను నా స్వార్థం కోసం ఈ సినిమాలో జాయిన్ అయ్యాను. తెలుగు సినిమా గ్లోబల్ రేంజ్‌కు చేరుకున్న నేపథ్యంలో, గ్లోబ‌ల్ సినిమా గురించి నేర్చుకోవ‌టానికే నేను శాకుంత‌లంలో జాయిన్ అయ్యాను. వి.ఎఫ్‌.ఎక్స్ గురించి నేర్చుకోవాల‌నే ఉద్దేశంతోనే ఇందులో పార్ట్ అయ్యాను. ఆర్ఆర్ఆర్‌తో తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాడు రాజమౌళి. అలాగే మరిన్ని తెలుగు సినిమాల‌ను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను వేసిన మొద‌టి అడుగు శాకుంత‌లం."


ఇలా శాకుంతలం ప్రాజెక్టులో చేరడం వెనక ఉద్దేశాన్ని బయటపెట్టాడు దిల్ రాజు. గుణశేఖర్ లాంటి సీనియర్ తో కలిసి పనిచేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నానని తెలిపిన దిల్ రాజు, ఈ సందర్భంగా దర్శకుడికి థ్యాంక్స్ చెప్పాడు.

First Published:  29 March 2023 1:49 PM GMT
Next Story