Telugu Global
Cinema & Entertainment

కావాలనే అమెజాన్ వారు సమంత పేరు వేయలేదా?

తాజాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేసిన ఒక ట్వీట్ వల్ల సమంత అభిమానులు మళ్లీ కంగారు పడుతున్నారు.

Samantha Ruth Prabhu
X

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత 

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ఆరోగ్య పరిస్థితి ఏమాత్రం బాగోలేదని తెలిసిన విషయమే. మయోసైటిస్ అనే ఒక అరుదైన వ్యాధితో సమంత ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సమంత తన షూటింగుల నుంచి బ్రేక్ తీసుకుంది.


అయితే ఈ మధ్యనే సమంత ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు కొంచెం కుదుటపడిందని త్వరలోనే ఆమె విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో నటిస్తున్న "ఖుషీ" సినిమా షూటింగ్ లో తిరిగి పాల్గొనబోతోంది అని వార్తలు వినిపించాయి.

దీంతో అభిమానులు కూడా చాలా సంతోషపడ్డారు. కానీ తాజాగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో వారు చేసిన ఒక ట్వీట్ వల్ల సమంత అభిమానులు మళ్లీ కంగారు పడుతున్నారు.

బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ నటిస్తున్న సిటాడల్ అనే ఒక వెబ్ సిరీస్ త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల కాబోతోంది. రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్టులో సమంత వరుణ్ ధావన్ సరసన హీరోయిన్గా నటించాల్సి ఉంది. తాజాగా ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను షేర్ చేసిన అమెజాన్ ప్రైమ్ వారు వచ్చే ఏడాది జనవరి నుంచి షూటింగ్ మొదలవుతుందని ప్రకటించారు.

వరుణ్ ధావన్, రాజ్, డీకే మరియు ఇతర టెక్నికల్ టీం సభ్యుల పేర్లు ఈ ట్వీట్ లో ట్యాగ్ చేసిన అమెజాన్ ప్రైమ్ వారు సమంత పేరు మాత్రం జత చేయలేదు. దీంతో సమంత ఆరోగ్య పరిస్థితి మళ్ళి క్షీణించి ఆమె ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా సమంత అధికారికంగా ప్రకటన ఇచ్చేవరకు తన ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి అని చెప్పుకోవచ్చు.

First Published:  22 Dec 2022 7:05 AM GMT
Next Story