Telugu Global
Cinema & Entertainment

Vishal Vijay | విజయ్ సినిమా ఆఫర్ పక్కనపెట్టిన విశాల్

Vishal Vijay - విజయ్ హీరోగా నటిస్తున్న సినిమా లియో. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించడానికి విశాల్ నిరాకరించాడు.

Vishal Vijay | విజయ్ సినిమా ఆఫర్ పక్కనపెట్టిన విశాల్
X

సెప్టెంబర్ 15న మార్క్ ఆంథోని రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రచారాన్ని ఆల్రెడీ స్టార్ట్ చేశాడు హీరో విశాల్. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న లియోలో తనకు ఓ పాత్ర చేయమని ఆఫర్ వచ్చిందని వెల్లడించాడు. అయితే ఆ ఆఫర్ ను తిరస్కరించాల్సి వచ్చిందని కూడా వెల్లడించాడు.

లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో హీరో విజయ్ నటించిన లియో అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా ప్రారంభంకావడానికి ముందు విశాల్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఈ సినిమాలో విజయ్ తో పాటు విశాల్ కూడా కనిపిస్తాడనే ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని స్పష్టం చేశాడు విశాల్.

విజయ్ సినిమాలో నటించడం తనకు ఎంతో ఇష్టమని, నిజానికి చాన్నాళ్లుగా ఎదురుచూశానని, కానీ తను వేరే సినిమాలో బిజీగా ఉన్న టైమ్ లో ఆఫర్ రావడంతో చేయలేకపోయానని బాధను వ్యక్తం చేశాడు. దర్శకుడు లోకేష్ తనకు చెప్పిన పాత్ర చాలా బాగుందని, కానీ డేట్స్ ఎడ్జెస్ట్ చేయలేక నటించలేకపోయానని అన్నాడు.

లియోలో నటించడానికి విశాల్ అంగీకరించి ఉంటే, ఆ మూవీ కోసం 4 నెలల సమయం కేటాయించాల్సి వచ్చేది. అంత టైమ్ కేటాయించలేక సినిమా నుంచి తప్పుకున్నట్టు వెల్లడించాడు.

లియో ఒక యాక్షన్ థ్రిల్లర్, దీనికి లోకేష్ కనగరాజ్ రచన, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో విజయ్, సంజయ్ దత్, త్రిష ప్రధాన పాత్రలు పోషించారు. గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ లాంటి వాళ్లు కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ సంగీతం అందించాడు.

First Published:  2 Sep 2023 8:35 AM GMT
Next Story