Telugu Global
Cinema & Entertainment

Dhoni LGM | ధోనీకి టాలీవుడ్ మార్కెట్ అక్కర్లేదా..?

Dhoni LGM | ధోనీ నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. సినిమా కూడా రెడీ చేశాడు. కానీ టాలీవుడ్ మార్కెట్ ను మాత్రం వదిలేశాడు.

Dhoni LGM | ధోనీకి టాలీవుడ్ మార్కెట్ అక్కర్లేదా..?
X

తెలుగులో ఓ సినిమా తీస్తే, తమిళ్ లో కూడా గట్టిగా ప్రచారం చేస్తున్నారు. పాన్ ఇండియా అయితే నార్త్ లో కూడా రౌండ్స్ కొడుతున్నారు. తమిళ సినిమాకు కూడా అదే విధంగా ప్రచారం జరుగుతున్న రోజులివి. ఇలాంటి టైమ్ లో ప్రతిష్టాత్మకంగా ఓ సినిమా నిర్మించిన ధోనీ.. తెలుగు మార్కెట్ ను పక్కనపెట్టడం ఆశ్చర్యకరం.

తాజాగా నిర్మాణ రంగంలోకి ఎంటరయ్యాడు ధోనీ. తన భార్యతో కలిసి సినిమాలు నిర్మించడానికి ఫిక్స్ అయ్యాడు. ఇందులో భాగంగా ఎల్జీఎమ్ అనే సినిమా ప్రొడ్యూస్ చేశాడు. తాజాగా ఈ సినిమా తమిళ ట్రయిలర్ లాంఛ్ చెన్నైలో అట్టహాసంగా జరిగింది.

ఈ ట్రయిలర్ లాంచ్ కోసం ప్రత్యేకంగా చెన్నై వచ్చాడు ధోనీ. ట్రయిలర్ లాంచ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఇది జరిగి కొన్ని రోజులైంది. ఇప్పుడీ సినిమా తెలుగు ట్రయిలర్ రిలీజ్ చేశారు. దీని కోసం ధోనీ హైదరాబాద్ వస్తాడని అంతా ఎదురుచూశారు. కానీ ధోనీ తెలుగు మార్కెట్ ను పట్టించుకున్నట్టు లేదు.

లవ్ టుడే, కాంతార, కేజీఎఫ్, విక్రమ్.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పరభాషా చిత్రాలు టాలీవుడ్ లో హిట్టయ్యాయి. ఓ చిన్న డబ్బింగ్ సినిమాకు కూడా తెలుగులో ప్రచారం చేస్తున్నారు. ఎల్జీఎమ్ మూవీ కోసం మాత్రం ధోనీ ఇప్పటివరకు హైదరాబాద్ రాలేదు. బహుశా, విడుదలకు ముందు అతడు టాలీవుడ్ పై దృష్టి పెడతాడేమో.

First Published:  19 July 2023 2:45 PM GMT
Next Story