Telugu Global
Cinema & Entertainment

Siddhu Jonnalagadda: సిద్దు జొన్నలగడ్డ సినిమాని హీరోయిన్లు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు?

Siddu Jonnalagadda: ఇక ఈ సినిమా కోసం మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. మరి "టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Siddhu Jonnalagadda
X

సిద్దు జొన్నలగడ్డ

2022లో సూపర్ హిట్ అయిన చిన్న సినిమాలలో "డీజె టిల్లు" కూడా ఒకటి. సిద్దు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా విమల్ కృష్ణ దర్శకత్వంలో ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై థియేటర్లలో కాసుల వర్షం కురిపించింది ఈ సినిమా. ఇక ఈ ఏడాది ఆగస్టులోనే ఈ సినిమాకి సీక్వెల్ గా "టిల్లు స్క్వేర్" సినిమాని కూడా ప్రకటించింది చిత్రం బృందం.

కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. ఈ సినిమా కోసం ఒక హీరోయిన్ ని పట్టుకోవడం నిర్మాతలకి ఒక పెద్ద చాలెంజ్ అయిందని చెప్పుకోవాలి. మొదటగా ఈ సినిమా కోసం శ్రీ లీలాని హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె కూడా సినిమాకి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ సినిమాలోని కొన్ని సన్నివేశాలను మార్చాలని డిమాండ్ చేసింది.

దీంతో దర్శక నిర్మాతలు అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. వారం రోజులు షూటింగ్లో పాల్గొన్న అనుపమ పరమేశ్వరన్ కూడా సినిమా నుంచి తప్పుకుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇంకా బయటకు రాలేదు. ఈ నేపథ్యంలో చిత్ర బృందం "ప్రేమమ్" బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా సంప్రదించారు.

కానీ ఇంటిమేట్ సన్నివేశాలు చేయటం లో తను కంఫర్టబుల్ కాదని మడోన్నా ఈ సినిమాను రిజెక్ట్ చేసింది. ఇక ఈ సినిమా కోసం మరొక హీరోయిన్ ని వెతికే పనిలో పడింది చిత్ర బృందం. మరి "టిల్లు స్క్వేర్ సినిమాలో సిద్దు జొన్నలగడ్డతో రొమాన్స్ చేసే హీరోయిన్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే. మల్లిక్ రామ్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.

First Published:  9 Dec 2022 4:00 PM GMT
Next Story