Telugu Global
Cinema & Entertainment

Ari Movie | కృష్ణుడిగా నటిస్తున్న స్టార్ హీరో?

Star hero Ari Movie | జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అరి మూవీ. ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటిస్తున్నాడు. అది కూడా కృష్ణుడి పాత్రలో..

Ari Movie | కృష్ణుడిగా నటిస్తున్న స్టార్ హీరో?
X

ప్రస్తుతం టాలీవుడ్ లో మైథలాజికల్ ట్రెండ్ నడుస్తోంది. శివుడు, కృష్ణుడు పాత్రలతో చాలా సినిమాలొస్తున్నాయి. అయితే ఆ పాత్రలను నేరుగా చూపించలేని పరిస్థితి. ఎందుకంటే, అలాంటి రోల్స్ పోషించడానికి ప్రస్తుతం స్టార్ నటులెవ్వరూ అందుబాటులో లేరు.

ఇలాంటి సమయంలో తన స్క్రిప్ట్ తో ఓ స్టార్ ను ఒప్పించాడు దర్శకుడు జయశంకర్. 'పేపర్ బాయ్' సినిమాతో పేరు తెచ్చుకున్న ఈ యువ దర్శకుడు, ఇప్పుడు అరి అనే సినిమా చేస్తున్నాడు. అరిషడ్వార్గాల నేపథ్యంలో తెలుగులో వస్తున్న తొలి సినిమా ఇది.

కల్కి, కార్తికేయ-2 సినిమాల్లో ఉన్నట్టుగానే ఇందులో కూడా కృష్ణుడి పాత్ర ఉంది. ఆ సినిమాల్లో చేసినట్టు అరిలో గ్రాఫిక్స్ తో నడిపించేయొచ్చు. కానీ జయశంకర్ అలా చేయదలుచుకోలేదు. తన స్క్రిప్ట్ తో ఓ స్టార్ హీరోను ఒప్పించాడు.

కృష్ణుడి గెటప్ లో ఆ హీరో అద్భుతంగా ఉన్నాడట. ఆల్రెడీ కొన్ని సన్నివేశాలు కూడా తెరకెక్కించారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమా ప్రమోషన్ కోసం ఆ హీరో ఎవరనే విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నట్టు తెలుస్తోంది.

అనసూయ, శుభలేఖ సుధాకర్, సాయికుమార్, వైవా హర్ష కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే అన్ని ఫస్ట్ లుక్స్ రిలీజయ్యాయి. మంగ్లి పాడిన పాట సూపర్ హిట్టయింది. త్వరలోనే కృష్ణుడి గెటప్ తో ఉన్న స్టార్ హీరో లుక్ కూడా రిలీజ్ చేస్తారేమో చూడాలి.

First Published:  30 Aug 2024 4:56 PM GMT
Next Story