Telugu Global
Cinema & Entertainment

పుష్ప-2 అప్ డేట్ ఎప్పుడు?

అల్లు అర్జున్ హీరోగా రాబోయే సినిమా పుష్ప 2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ఎప్పుడు సెట్స్ ఫైకి వస్తుంది?

పుష్ప-2 అప్ డేట్ ఎప్పుడు?
X

లెక్కప్రకారం ఈ పాటికి పుష్ప-2 నుంచి అప్ డేట్ రావాలి. ఎందుకంటే, అక్టోబర్ 1 నుంచి ఈ సినిమా సెట్స్ పైకొస్తుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు వేదిక కూడా ఫిక్స్ చేసినట్టు వార్తలొచ్చాయి. అల్లు అర్జున్ కు చెందిన అల్లు స్టుడియోస్ లో పుష్ప-2 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని ప్రచారం జరిగింది.


అక్టోబర్ 1నుంచి రెగ్యులర్ షూటింగ్ అంటే ఈపాటికే సోషల్ మీడియాలో హంగామా మొదలవ్వాలి. కానీ అలాంటి హంగామా ఏం కనిపించడం లేదు. పుష్ప-2 పై ఎలాంటి అప్ డేట్ లేదు.


మొన్నటివరకు బన్నీ, సుకుమార్ అందుబాటులో లేకపోవడం వల్ల పుష్ప-2పై ఎవ్వరూ ఎలాంటి అప్ డేట్ ఆశించలేదు. బన్నీ ఫ్యామిలీ ట్రిప్ కు వెళ్లాడు. అతడు తిరిగొచ్చిన తర్వాత, సుకుమార్ దుబాయ్ వెళ్లాడు. కానీ ఇప్పుడు ఇద్దరూ హైదరాబాద్ లోనే ఉన్నారు. బన్నీ వరుసపెట్టి యాడ్స్ చేస్తున్నాడు. సుకుమార్ పుష్ప-2 స్క్రిప్ట్ కు తుది మెరుగులు దిద్దుతున్నట్టు కనిపిస్తోంది.


తాజా సమాచారం ప్రకారం.. దసరాకు పుష్ప-2 యూనిట్ నుంచి అప్ డేట్ వచ్చే అవకాశం ఉంది. దసరా సంబరాలు పూర్తయిన వెంటనే ఈ సినిమా సెట్స్ పైకి వచ్చేలా ఉంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో పుష్పకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

First Published:  28 Sep 2022 11:57 AM GMT
Next Story