Telugu Global
Cinema & Entertainment

Pooja Hegde: పూజా హెగ్డే నాలుగవ ఫ్లాప్ అందుకుంటుందా లేక మొదటి హిట్ సొంతం చేసుకుంటుందా?

Pooja Hegde: 2022 స్టార్ బ్యూటి పూజ హెగ్డే కి ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు అని చెప్పుకోవాలి. పూజ హెగ్డే ఈ ఏడాది నాలుగు భారీ బడ్జెట్ సినిమాలలో నటించింది అందులో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి.

Pooja Hegde
X

Pooja Hegde: సగం సగం వద్దంటున్న పూజా హెగ్డే

2022 స్టార్ బ్యూటి పూజ హెగ్డే కి ఈ సంవత్సరం పెద్దగా కలిసి రాలేదు అని చెప్పుకోవాలి. పూజ హెగ్డే ఈ ఏడాది నాలుగు భారీ బడ్జెట్ సినిమాలలో నటించింది అందులో మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. ముఖ్యంగా రాధే శ్యామ్ మరియు ఆచార్య సినిమాలు లు పూజ కరీర్ లో అతిపెద్ద ఫెయిల్యూర్ గా నిలిచాయి. "బీస్ట్" సినిమాకి తమిళ్ లో మంచి రెస్పాన్స్ లభించింది కానీ తెలుగులో మాత్రం ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అనే చెప్పుకోవాలి.

ప్రస్తుతం ఇప్పుడు పూజ హెగ్డే హిందీలో "సర్కస్" అనే సినిమాతో త్వరలో ప్రేక్షకులందరికీ రాబోతోంది. ఈ సినిమా డిసెంబర్ 23న థియేటర్ లలో విడుదల కాబోతోంది. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.

పూజ హెగ్డే ఈ సినిమాతో నాలుగవ డిజాస్టర్ అందుకుంటుందా లేక మొట్ట మొదటి సూపర్ హిట్ అందుకుంటుందా అని ఇంకా తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా తర్వాత పూజ హెగ్డే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న "కిసీ కా భాయ్.. కిసీ కీ జాన్" సినిమాలో నటించనున్నారు. మరోవైపు సర్కస్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు పూజ హెగ్డే. ఈ సంవత్సరం పూజ హెగ్డే ఈ సినిమా తో ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.

మరో వైపు పూజ హెగ్డే మహేష్ బాబు హీరో గా సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించనుంది. ఇక చేతిలో ఇన్ని సినిమాలు ఉండటంతో ఖచ్చితంగా పూజ హెగ్డే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందని అభిమానులు సైతం విశ్వసిస్తున్నారు.

First Published:  10 Dec 2022 3:16 PM GMT
Next Story