Telugu Global
Cinema & Entertainment

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ని బ్యాన్ చేస్తే ఒరిగేదేంటి?

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నడలో సూపర్ హిట్ అయిన "కాంతారా" సినిమాని ఇంకా చూడలేదని చెప్పింది. ఇక తనకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు కూడా చెప్పడానికి ఇష్టపడక పోవడం తో రష్మిక పై కన్నడిగులు ఒక రేంజ్ లో మండి పడుతున్నారు.

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ని బ్యాన్ చేస్తే ఒరిగేదేంటి?
X

Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ని బ్యాన్ చేస్తే ఒరిగేదేంటి?

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల జాబితాలో రష్మిక మందన్న పేరు ముందే ఉంటుంది. 2016లో విడుదలైన "కిరిక్ పార్టీ" అనే కన్నడ సినిమాతో హీరోయిన్ గా మారిన రష్మిక "చలో" సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ భామ వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించింది. తెలుగులో స్టార్ స్టేటస్ అందుకున్న ఈ భామ కన్నడలో గత ఐదేళ్లలో రెండు సినిమాలలో మాత్రమే కనిపించింది.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నడలో సూపర్ హిట్ అయిన "కాంతారా" సినిమాని ఇంకా చూడలేదని చెప్పింది. ఇక తనకు హీరోయిన్ గా ఆఫర్ ఇచ్చిన నిర్మాణ సంస్థ పేరు కూడా చెప్పడానికి ఇష్టపడక పోవడం తో రష్మిక పై కన్నడిగులు ఒక రేంజ్ లో మండి పడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే శాండల్ వుడ్ రష్మిక మందన్న ని బ్యాన్ చేయబోతోంది అని వార్తలు మొదలయ్యాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కన్నడ సినిమా ఇండస్ట్రీ తనను బ్యాన్ చేశారు అనే విషయం పై క్లారిటీ ఇచ్చింది ఈ భామ. ఇప్పటిదాకా అయితే నన్ను ఏ నిర్మాత కూడా బ్యాన్ చేయలేదు అని స్పష్టం చేసింది రష్మిక మందన్న.

అంతే కాకుండా కాంతారా సినిమాని ఇప్పుడు చూసానని చిత్ర బృందానికి శుభాకాంక్షలు కూడా చెప్పానని వాళ్లు కూడా కృతజ్ఞతలు చెప్పారని చెప్పుకొచ్చింది రష్మిక మందన్న. ఇక కన్నడ సినిమాలు చేయడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పిన రష్మిక ప్రస్తుతం అల్లు అర్జున్ నటిస్తున్న "పుష్ప 2" మరియు హిందీ లో రన్బీర్ కపూర్ "యానిమల్" లో కూడా హీరోయిన్ గా నటిస్తోంది.

నిజానికి రష్మిక ని బ్యాన్ చేస్తే ఎవరికీ ఒరిగేది ఏమి లేదు. రష్మిక ఎలాగో కన్నడ లో పెద్దగా సినిమాలు చేయడం లేదు. ఆమెను బాన్ చేసినా చేయక పోయినా ఆమె కన్నడ సినిమా మీద ఎలాగో ఫోకస్ చెయ్యట్లేదు కాబట్టి దీన్ని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం అస్సలు లేదు.

First Published:  11 Dec 2022 8:10 AM GMT
Next Story