Telugu Global
Cinema & Entertainment

Michael Movie: మైఖేల్ సినిమా జానర్ ఏంటి?

Sundeep Kishan's Michael Movie - సందీప్ కిషన్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ మైఖేల్. ఇంతకీ ఈ సినిమా జానర్ ఏంటి?

Michael Movie: మైఖేల్ సినిమా జానర్ ఏంటి?
X

సందీప్ కిషన్ నటించిన తొలి పాన్ ఇండియా మూవీ మైఖేల్. ఈ సినిమా ట్రయిలర్ తాజాగా రిలీజైంది. ఆకట్టుకుంది కూడా. అయితే జానర్ ఏంటనేది మాత్రం ఎవ్వరూ గెస్ చేయలేని విధంగా ఉంది. దీనిపై మైఖేల్ మూవీ దర్శకుడు రంజిత్ జయకొడి స్పందించాడు. తన సినిమాలో అన్ని జానర్స్ ఉంటాయంటున్నాడు.

"మైఖేల్ మూవీ ఒక జోనర్ అని చెప్పలేం. రొమాంటిక్, యాక్షన్, గ్యాంగ్ స్టార్ డ్రామా, పిరియడ్ ఫిల్మ్ అనొచ్చు. ఇందులో 70, 80, 90 ఇలా మూడు కాలాలు వుంటాయి. ఎక్కువ భాగం 90లో వుంటుంది. కథ చాలా ఆసక్తికరంగా వుంటుంది. గ్యాంగ్ స్టార్ డ్రామా వున్న బ్యూటీఫుల్ రొమాంటిక్ లవ్ స్టొరీ ఇది."

ఇలా సినిమా జానర్ పై స్పందించాడు రంజిత్. సందీప్ కిషన్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని, అతడి కోరిక మేరకు ఓ మంచి యాక్షన్ డ్రామా చేశానని చెప్పుకొచ్చిన రంజిత్... కేవలం తనతో ఉన్న స్నేహం కొద్దీ విజయ్ సేతుపతి ఇందులో నటించినట్టు వివరించాడు.

First Published:  28 Jan 2023 2:59 PM GMT
Next Story