Telugu Global
Cinema & Entertainment

SreeLeela | ఇప్పుడు శ్రీలీల పరిస్థితేంటి..?

Sreeleela - వరుస అవకాశాలతో దూసుకుపోతోంది శ్రీలీల. అయితే గుంటూరుకారం ఆమె కెరీర్ కు బ్రేకులేసేలా కనిపిస్తోంది.

SreeLeela | ఇప్పుడు శ్రీలీల పరిస్థితేంటి..?
X

మొన్నటివరకు ఆమె టాప్ హీరోయిన్. వరుసపెట్టి సినిమాలు చేసింది. కానీ అదే టైమ్ లో వరుసపెట్టి ఫ్లాపులు కూడా వచ్చాయి. ఇలా ఎన్ని ఫ్లాపులు వెక్కిరించినా శ్రీలీల వెనక్కు తగ్గలేదు. ఎందుకంటే, ఆమె చేతిలో గుంటూరుకారం లాంటి పెద్ద సినిమా ఉంది. ఆ సినిమా ఒక్కటి చాలు, తన కెరీర్ ను పరుగులు పెట్టిస్తుందని భావించింది శ్రీలీల. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా గుంటూరుకారం సినిమా ఫ్లాప్ అయింది. దీంతో శ్రీలీల కెరీర్ డైలమాలో పడింది.

ఆమె ఇంతకుముందు ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్, ఆదికేశవ రూపంలో డిజాస్టర్స్ ఇచ్చింది. అయినప్పటికీ ఆ సినిమాలు శ్రీలీల కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపించలేదు. ఎందుకంటే, అప్పటికి మహేష్ బాబు సినిమా చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడీ సినిమా ఫ్లాప్ అవ్వడంతో శ్రీలీల కెరీర్ పై గట్టిగా ప్రభావం చూపించేలా ఉంది.

ప్రస్తుతానికైతే శ్రీలీల కొత్త సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఆమె తన చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తిచేసే పనిలో ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ సినిమాలో ఆమె నటిస్తుందా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ లేదు. కొత్త ఏడాదిలో శ్రీలీల కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.

First Published:  19 Jan 2024 4:29 PM GMT
Next Story