Telugu Global
Cinema & Entertainment

Janhvi Kapoor | జాన్వి కపూర్, మరో అలియా భట్ అవుతుందా?

Janhvi Kapoor - దేవర సినిమాలో నటిస్తున్న జాన్వి కపూర్ పై కొత్త పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇంతకీ ఏంటవి?

Janhvi Kapoor | జాన్వి కపూర్, మరో అలియా భట్ అవుతుందా?
X

ఇదేదో నటనపరంగా, క్రేజ్ పరంగా అలియాభట్ తో పోలిక కాదు. దేవర, ఆర్ఆర్ఆర్ సినిమాల మధ్య పోలిక ఇది. రాజమౌళి తీసిన ఆర్ఆర్ఆర్ సినిమాలో హీరోయిన్ గా నటించింది అలియా భట్. అయితే సినిమాలో ఆమెకు అంత ప్రాధాన్యం దక్కలేదు. కేవలం ఒకేఒక్క సీన్ లో మెప్పించింది. పాటలకు మాత్రమే పరిమితమైంది.

ఇప్పుడు జాన్వి కపూర్ పరిస్థితి కూడా ఇదే అంటున్నారు చాలామంది. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది జాన్వి కపూర్. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వికి అంత సీన్ లేదంటున్నారు చాలామంది. కేవలం సాంగ్స్ కోసం మాత్రమే జాన్విని తీసుకున్నారని, ఒరిజినల్ కథకు, జాన్వి కపూర్ కు పెద్దగా కనెక్షన్ ఉండదనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి కొరటాల సినిమాల్లో హీరోయిన్ పాత్రలకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, ఆచార్య.. ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో హీరోయిన్ పాత్రలు కూడా మెరిశాయి. కాబట్టి దేవరలో కూడా కచ్చితంగా హీరోయిన్ కు ప్రాధాన్యం ఉండితీరాలి.

అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ మాత్రం మరోలా ఉంది. కేవలం ఎన్టీఆర్ కు ప్రేయసిగా 2-3 సన్నివేశాల్లో మాత్రమే జాన్వి కనిపిస్తుందని, పాటల్లో మెరుస్తుందని అంటున్నారు. సమ్మర్ లో విడుదలకానుంది దేవర. అప్పుడు పూర్తిస్థాయిలో క్లారిటీ వస్తుంది

First Published:  22 Jan 2024 5:17 PM GMT
Next Story