Telugu Global
Cinema & Entertainment

Weekend Release | ఆంటోనీ నిలబడతాడా?

Weekend Release - విశాల్ నటించిన మార్క్ ఆంటోనీ సినిమా ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా రిజల్ట్ మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

Weekend Release | ఆంటోనీ నిలబడతాడా?
X

ఈ వీకెండ్ కూడా వరుసగా 6 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే వీటిలో అందర్నీ ఎట్రాక్ట్ చేస్తున్న సినిమా మార్క్ ఆంటోనీ. ట్రయిలర్ తో ఈ సినిమా మంచి అంచనాల్ని సెట్ చేసింది. ఈమధ్య కాలంలో బాగా క్లిక్ అయిన ట్రయిలర్స్ లో ఒకటిగా నిలిచింది మార్క్ ఆంటోనీ.

ఈ వారాంతం వస్తున్న 6 సినిమాల్లో రామన్న యూత్, ఛాంగురే బంగారు రాజా, అను, సోదరసోదరీమణులారా లాంటి సినిమాలున్నాయి. వీటితో పాటు బిచ్చగాడు సినిమా రీ-రిలీజ్ అవుతోంది. వీటిలో మార్క్ ఆంటోనీ మాత్రమే ఆకర్షిస్తోంది. మిగతావన్నీ చిన్న సినిమాలే.

మార్క్ ఆంటోనీకి కలిసొచ్చిన మరో అంశం. థియేటర్లలో గ్యాప్. ప్రస్తుతం మార్కెట్లో నిలదొక్కుకున్న సినిమా లేదు. ఖుషి కి పూర్తిగా ఆక్యుపెన్సీ తగ్గిపోయింది. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా ఓ సెక్షన్ ఆడియన్స్ కే పరిమితమైంది. ఇలాంటి టైమ్ లో ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా, మార్క్ ఆంటోనీకి అది ప్లస్ అవుతుంది.

వినోద్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విశాల్ సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. కీలక పాత్రల్లో ఎస్ జే సూర్య, సునీల్ కనిపించనున్నారు. విశాల్ ఇందులో ద్విపాత్రాభినయం చేశాడు. ఆంటోనీ నిలబడతాడా లేదా అనే విషయం మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

First Published:  14 Sep 2023 5:25 PM GMT
Next Story