Telugu Global
Cinema & Entertainment

Weekend Release - ఈ వారం 5 సినిమాలు విడుదల

Weekend Release - ఈ వారాంతం ఏకంగా 5 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో అంచనాలున్న సినిమాలు 2 మాత్రమే.

Weekend Release - ఈ వారం 5 సినిమాలు విడుదల
X

సంక్రాంతి సినిమాలు థియేటర్లలోకొచ్చి దాదాపు నెల రోజులు పూర్తయింది. వాటి హవా కూడా పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఓ మోస్తరు అంచనాలతో తెరకెక్కిన సినిమాలు క్యూ కట్టడం మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా సర్ సినిమా రేపు థియేటర్లలోకి వస్తోంది.

ధనుష్ హీరోగా నటించిన తొలి తెలుగు సినిమా సర్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మించింది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. విద్యా వ్యవస్థలో ఉన్న లొసుగుల్ని ప్రశ్నించేలా తెరకెక్కిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. సంక్రాంతి సినిమాల తర్వాత అంచనాలతో వస్తున్న మూవీ ఇదే.

సర్ సినిమా రిలీజైన 24 గంటల తర్వాత ఒకేసారి 4 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో కిరణ్ అబ్బవరం నటించిన వినరో భాగ్యము విష్ణుకథ, సంతోష్ శోభన్ నటించిన శ్రీదేవి శోభన్ బాబు సినిమాలున్నాయి. వీటితో పాటు ఊ అంటావా మామ ఉఊ అంటావా అనే హారర్-కామెడీ, యాంట్ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమా థియేటర్లలోకి వస్తున్నాయి.

First Published:  16 Feb 2023 4:56 AM GMT
Next Story