Telugu Global
Cinema & Entertainment

Weekend Release| ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు

Weekend Release 8 Movies - ఈ వారంతం ఏకంగా 8 సినిమాలు రిలీజ్ అవ్వబోతున్నాయి. సినిమా సందడి ఈరోజు నుంచే ప్రారంభమైంది.

Weekend Release| ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు
X

ఎప్పట్లానే ఈవారం కూడా థియేటర్లలోకి గంపగుత్తగా సినిమాలొస్తున్నాయి. వాటిలో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీస్ మాత్రం మూడే. మరీ ముఖ్యంగా ఈ వారం సినిమా సందడి ఇవాళ్టి నుంచే మొదలుకాబోతోంది.

ఈరోజు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త థియేటర్లలోకి వచ్చింది. కెరీర్ లో దుల్కర్ చేసిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ ఇది. అంతేకాదు, ప్రాపర్ పాన్ ఇండియా సినిమా కూడా ఇదే. మలయాళంలో కొత్త అంటే టౌన్ అని అర్థం. కానీ తెలుగులో మాత్రం కొత్త అంటే వేరే అర్థం ఉంది. అందుకే ఈ సినిమాను తెలుగులో కింగ్ ఆఫ్ కోతగా వ్యవహరిస్తున్నారు.

ఇక రేపు థియేటర్లలోకి ఒకేసారి 6 సినిమాలొస్తున్నాయి. వీటిలో ఎట్రాక్ట్ చేస్తున్న మూవీ గాండీవధారి అర్జున. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది. కంప్లీట్ యాక్షన్ సినిమా ఇది.

కార్తికేయ హీరోగా నటించిన బెదురులంక-2012 కూడా రేపు థియేటర్లలోకి వస్తోంది. యుగాంతం కాన్సెప్ట్ తో కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తోంది ఈ సినిమా. నేహాశెట్టి హీరోయిన్ గా నటించింది. క్లార్క్స్ దర్శక్వం వహించాడు. మణిశర్మ సంగీతం అందించాడు. అటు వరుణ్ తేజ్, ఇటు కార్తికేయ ఇద్దరికీ తమ సినిమాలు చాలా కీలకం.

ఈ మూవీస్ తో పాటు.. దక్ష, రెంట్, నేనేనా, ఏం చేస్తున్నావ్, బాయ్ హాస్టల్ లాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలుగా వస్తున్న వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో చెప్పలేం.

First Published:  24 Aug 2023 2:34 AM GMT
Next Story