Telugu Global
Cinema & Entertainment

Weekend movie releases: ఈరోజు రిలీజయ్యే సినిమాలివే!

Weekend movie releases: ఈవారం 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. స్ట్రయిట్ మూవీస్ కంటే డబ్బింగ్ సినిమాగా వస్తున్న లవ్ టుడేపైనే ఎక్కువమందికి ఫోకస్ ఉంది.

Weekend movie releases: ఈరోజు రిలీజయ్యే సినిమాలివే!
X

ఈరోజు 6 సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో 2 డబ్బింగ్ సినిమాలు కాగా, మిగతా 4 స్ట్రయిట్ తెలుగు సినిమాలు. ఆశ్చర్యకరంగా తెలుగు సినిమాల కంటే డబ్బింగ్ సినిమాలపైనే బజ్ ఎక్కువగా ఉంది.

అల్లరి నరేష్ హీరోగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఈరోజు థియేటర్లలోకి వస్తోంది. పేరుకు ఇది అల్లరోడి సినిమా అయినప్పటికీ, పెద్దగా ప్రచారం లేకపోవడంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో చర్చ పెద్దగా జరగడం లేదు. ఆనంది హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఓ సీరియస్ సబ్జెక్ట్ తో తెరకెక్కింది.

ఈ మూవీతో పాటు రణస్థలి, మన్నించవా, వల అనే మరో 3 సినిమాలు కూడా థియేటర్లలోకి వస్తున్నాయి. అయితే వీటిపై ఎవ్వరికీ పెద్దగా ఎలాంటి అంచనాల్లేవు. వీటి నుంచి ఆశ్చర్యపరిచే ఫలితాలు కూడా రాకపోవచ్చు.

ఇక డబ్బింగ్ విషయానికొస్తే, లవ్ టుడే అనే సినిమా థియేటర్లలోకి వస్తోంది. స్వయంగా దిల్ రాజు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. తమిళ్ లో ఆల్రెడీ పెద్ద హిట్. దాదాపు 55 కోట్లు కలెక్ట్ చేసింది. తెలుగులో గట్టిగా ప్రచారం చేశారు. దీంతో లవ్ టుడే పై అందరి కన్నుపడింది. పైగా ఇది యూత్ మూవీ.

ఈ మూవీతో పాటు తోడేలు అనే మరో డబ్బింగ్ మూవీ కూడా వస్తోంది. అల్లు అరవింద్ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ హిందీ డబ్బింగ్ సినిమాకు కూడా మంచి థియేటర్లు దొరికాయి. వీటిలో ఏ సినిమా క్లిక్ అవుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోతుంది.

First Published:  25 Nov 2022 2:36 AM GMT
Next Story