Telugu Global
Cinema & Entertainment

Weekend Release | ఈవారం ఏకంగా 10 సినిమాలు

Weekend Release - ఈవారం ఏకంగా 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అన్నీ చిన్న సినిమాలే. ఓ మోస్తరు అంచనాలతో వస్తున్న సినిమా ఒకే ఒక్కటి.

Weekend Release | ఈవారం ఏకంగా 10 సినిమాలు
X

ప్రతి వారంలానే ఈవారం కూడా కొన్ని సినిమాలు థియేటర్లలోకి వచ్చేందుకు రెడీ అయ్యాయి. అయితే ఈసారి ఏకంగా 10 చిన్న సినిమాలు క్యూ కట్టడం విశేషం. వీటిలో 2 రీ-రిలీజెస్ కూడా ఉన్నాయి

ఈవారం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ మూవీ ఎల్జీఎం. లెట్స్ గెట్ మ్యారీడ్ అనేది దీని అర్థం. హరీష్ కల్యాణ్, ఇవానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో నదియా కీలక పాత్ర పోషించింది. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కారణం క్రికెటర్ ధోనీ. ఈ స్టార్ క్రికెటర్ నిర్మాతగా మారి తెరకెక్కించిన మొదటి సినిమా ఇది.

ఈ సినిమాతో పాటు హెబ్బులి, మిస్టేక్ అనే మరో 2 సినిమాలు కూడా వస్తున్నాయి. సుదీప్, అమలాపాల్ హీరోహీరోయిన్లుగా నటించిన డబ్బింగ్ మూవీ హెబ్బులి. ఇక భారీ ప్రచారంతో వస్తున్న సినిమా మిస్టేక్. ఈ సినిమాలపై పెద్దగా అంచనాల్లేవ్.

రీ-రిలీజెస్ విషయానికొస్తే.. సూర్య కెరీర్ లో కల్ట్ మూవీగా నిలిచిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా రీ-రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అటు బాలకృష్ణ నటించిన ఫాంటసీ మూవీ భైరవద్వీపం కూడా ఈ వీకెండ్ రీ-రిలీజ్ అవుతోంది. బాలయ్య నుంచి వస్తున్న మూడో రీ-రిలీజ్ ఇది.

ఈ సినిమాలతో పాటు.. రాజుగారి కోడిపులావ్, కృష్ణగాడు అంటే ఒక రేంజ్, దిల్ సే, ప్రియమైన ప్రియ, బ్లడ్ అండ్ చాక్లెట్ సినిమాలు కూడా ఈ వారాంతం థియేటర్లలోకి వస్తున్నాయి.

First Published:  3 Aug 2023 4:35 AM GMT
Next Story