Telugu Global
Cinema & Entertainment

తేరి రీమేక్: హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది?

Pawan Kalyan Theri Remake: ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా ని ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తేరి" రీమేక్‌ అని ఇప్పటికే సినిమాకి సంబంధించి బోలెడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తేరి రీమేక్: హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది?
X

తేరి రీమేక్: హరీష్ శంకర్ ని టార్గెట్ చేస్తే ఏమొస్తుంది?

ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా ని ఈ మధ్యనే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా తమిళ్ లో సూపర్ హిట్ అయిన "తేరి" రీమేక్‌ అని ఇప్పటికే సినిమాకి సంబంధించి బోలెడు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక మరోవైపు ఇంకొక రీమేక్ సినిమా వద్దు బాబోయ్ అంటున్న అభిమానులు #WeDontWantTheriRemake అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. ఈ సినిమా పట్టా లెక్కితే ఆత్మహత్య చేసుకుంటామని కూడా కొందరు బెదిరిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడు హరీష్ శంకర్‌ని టార్గెట్ చేస్తూ పుకార్లు మొదలయ్యాయి.

పైగా హరీష్ శంకర్ స్వయంగా పీకే వీరాభిమాని కాబట్టి అభిమానులకు అదిరిపోయే కథ ఉంటుంది అని అందరూ అనుకుంటూ ఉండగా, ఈ సినిమా తేరి రీమేక్ అని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ హరీష్ శంకర్ ఈ ప్రాజెక్ట్‌ను సెట్ చేయలేదు. హరీష్ శంకర్ చేతిలో కేవలం స్టార్ హీరోల డిమాండ్లను మాత్రమే పాటించగల సత్తా ఉంటుంది. ఇక హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా కూడా ఒక ఒరిజినల్ సినిమా తీయాలని అభిమానులు అంటున్నారు. "తేరి" రీమేక్ విషయంలో ఫ్యాన్స్ ఇప్పుడు హరీష్ శంకర్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానీ ఈ సినిమా షూటింగ్ త్వరగా పూర్తి చేయాలి అనుకున్న పవన్ కళ్యాణ్ రీమేక్ కథ అయితే రెడీ మేడ్ కథ ఉంటుంది అని చెబుతున్నారు. ఇందులో హరీష్ శంకర్ కూడా చేయగలిగింది ఏమీ లేదని చెప్పుకోవచ్చు. మరి పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ సినిమా ఎలా ఉండబోతోందో చూడాలి.

First Published:  10 Dec 2022 3:42 PM GMT
Next Story