Telugu Global
Cinema & Entertainment

వెయ్యి రివ్యూలు, 7కు పైగా రేటింగ్ ఉంటేనే సినిమా చూస్తా.. నాగార్జున కామెంట్స్ వైరల్ ..!

ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ప్లాప్ అవ్వాలన్నా అందులో రివ్యూలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే

Akkineni Nagarjuna
X

Akkineni Nagarjuna

ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ప్లాప్ అవ్వాలన్నా అందులో రివ్యూలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రివ్యూల వల్ల సినిమాలకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరుగుతోందని చెప్పేవారే ఇండస్ట్రీలో ఎక్కువ. ఒకప్పుడు సినిమా విడుదల అయితే అది ఎలా ఉందో చూసేదానికైనా ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్ల వద్దకు వెళ్లేవారు. అయితే రివ్యూలు వచ్చిన తర్వాత సినిమా బాగాలేదని రివ్యూలు వస్తే మ్యాట్నీ షో నుంచే కలెక్షన్లు పడిపోతున్నాయి.

అయితే మంచి సినిమాలకు రివ్యూలు మేలే చేస్తాయని.. ప్రేక్షకులను థియేటర్ల వద్దకు రప్పిస్తాయని మరికొందరి వాదన. కాగా రివ్యూలపై తాజాగా స్టార్ హీరో నాగార్జున స్పందించారు. తాను రివ్యూ చూసిన తర్వాతే సినిమా చూస్తానని, బాగోలేకపోతే టైం వృథా కదా.. అని వ్యాఖ్యానించి ఆశ్చర్యపరిచారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూలో నాగార్జున రివ్యూల గురించి మాట్లాడుతూ.. గతంలో సినిమాకు సంబంధించిన రివ్యూలు వారం తర్వాత పత్రికలు, మ్యాగజైన్లలో వచ్చేవన్నారు. జనం ఆలస్యంగా సినిమాలకు సంబంధించి రివ్యూలు తెలుసుకునే వారని, అయితే అప్పటికి ఆ సినిమా థియేటర్ లో ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి అని అన్నారు. అందువల్ల జనం ఆ రివ్యూలకు పెద్దగా స్పందించే వారు కాదని అన్నారు. ఇప్పుడు సోషల్ మీడియా, వెబ్ సైట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా విడుదలైన గంటల్లోనే రివ్యూలు వచ్చేస్తున్నాయని చెప్పారు.

జనం రివ్యూలు చదివి బాగుంటే థియేటర్లకు వస్తున్నారని.. ఒక సినిమా టాక్ జనంలోకి తీసుకువెళ్లేందుకు రివ్యూలు ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు ఆయన చెప్పారు. తాను ఏదైనా సినిమా లేదా వెబ్ సిరీస్ చూడాలంటే ముందుగా ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్ చూస్తానన్నారు. కనీసం వెయ్యి రివ్యూలు చదువుతానని, ఏడు పైన రేటింగ్ ఉంటేనే సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా చూస్తానని.. లేకపోతే టైం వృథా కదా.. అని నాగార్జున కామెంట్స్ చేశాడు. సినిమా రివ్యూలపై నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

First Published:  15 Sep 2022 1:30 AM GMT
Next Story