Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: దుమ్ముదులుపుతున్న టైటిల్ సాంగ్

Waltair veerayya చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ సూపర్ హిట్ అయింది. రికార్డ్స్ సృష్టిస్తోంది

Waltair Veerayya: దుమ్ముదులుపుతున్న టైటిల్ సాంగ్
X

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా నుంచి వరుసపెట్టి పాటలు వస్తున్నాయి. కానీ టైటిల్ సాంగ్ కోసం చాలామంది వెయిటింగ్. ఇప్పుడు ఆ టైమ్ రానే వచ్చింది. వాల్తేరు వీరయ్య నుంచి తాజాగా టైటిల్ సాంగ్ రిలీజైంది. ఇలా రిలీజైందో లేదో అలా సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది ఈ సాంగ్.


యూట్యూబ్ లో ఈ సాంగ్ కు గంటగంటకు వేలల్లో వ్యూస్ వస్తున్నాయి. విడుదలైన 15 గంటలకే ఈ సినిమాకు 4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఏకంగా లక్షన్నరకు పైగా లైక్స్ వచ్చాయి


మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'వాల్తేరు వీరయ్య' అభిమానులకు, మాస్ కు చాలా ప్రత్యేకమైన చిత్రం కానుంది. బాబీ స్వయంగా మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని కావడం, అభిమానులకు కావాల్సిన అంశాలన్నీ సమపాళ్ళలో అందించి చిత్రాన్ని ఫుల్ మీల్ ఫీస్ట్ రెడీ చేస్తున్నాడు. ఇందులో భాగంగా టైటిల్ సాంగ్ వచ్చేసింది.


చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించాడు. వాల్తేరు వీరయ్య పరాక్రమాన్ని వీరోచితంగా ప్రజంట్ చేసేలా ఉంది సాహిత్యం. దేవి శ్రీ ప్రసాద్ అద్భుతమైన కంపోజిషన్‌ ఇందులో కనిపించింది. బ్రాస్ ఆర్కెస్ట్రా సెక్షన్ బ్యాంకాక్ మ్యుజిషియన్స్ తో రికార్డ్ చేశారు. అనురాగ్ కులకర్ణి ఎనర్జిటిక్ గా పాడాడు.


ఆల్బమ్‌లోని బాస్ పార్టీ, నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి ఇప్పటికే చార్ట్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇప్పుడు ఈ సినిమా టైటిల్ ట్రాక్ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది.



First Published:  27 Dec 2022 10:59 AM GMT
Next Story