Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్

చిరు హీరోగా నటిస్తున్న సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ మూవీ నుంచి ఈవారమే ఫస్ట్ సాంగ్ వస్తోంది

Waltair Veerayya: ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్
X

మెగాస్టార్ చిరంజీవి మెగా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'వాల్తేర్ వీరయ్య'. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవర్ ఫుల్ పాత్రలో రవితేజ కనిపించబోతున్నాడు. ఇద్దరు స్టార్స్‌ని కలిసి తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


తాజాగా 'వాల్తేరు వీరయ్య' నుండి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఫస్ట్ సింగిల్ ఈ వారమే విడుదల కాబోతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సాంగ్ గురించి ట్వీట్ చేశాడు. ''ఇప్పుడే 'వాల్తేరు వీరయ్య' ఫస్ట్ సాంగ్ ని చూశాను. మెగాస్టార్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మైండ్ బ్లోయింగ్. ఫస్ట్ సింగల్ ఈ వారమే విదుదలౌతుంది. పార్టీకి సిద్ధంగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ'' అని ట్వీట్ చేశాడు.


వాల్తేరు వీరయ్యలో చిరంజీవి, ఊర్వశి రౌతేలా పై ఓ భారీ సెట్‌లో స్పెషల్ సాంగ్ ని చిత్రీకరించారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రఫీ చేశాడు. ఇదే పాటని ఈ వారం విడుదల చేస్తున్నారు మేకర్స్. చిరంజీవి- దేవిశ్రీ ప్రసాద్ ది చార్ట్ బస్టర్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ వచ్చిన చిత్రాలు మ్యజికల్ గా ట్రెండ్ సెట్ చేశాయి. ఇప్పుడు వాల్తేరు వీరయ్య' ఆల్బమ్ పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.


అన్ని కమర్షియల్ హంగులతో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. వాల్తేరు వీరయ్య 2023 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

First Published:  14 Nov 2022 10:11 AM GMT
Next Story