Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya Box Office: 2 రోజులకే మిలియన్ డాలర్ క్లబ్ లోకి..!

Waltair Veerayya entered into 1 million club: విడుదల అయిన 2 రోజులకే మిలియన్ డాలర్ల క్లబ్ లోకి ఎంటర్ అయింది వాల్తేరు వీరయ్య సినిమా.

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు
X

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు

చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా ఓవర్సీస్ లో దుమ్ముదులుపుతోంది. ఈ సినిమాకు రికార్డ్ ఓపెనింగ్స్ దక్కిన సంగతి తెలిసిందే. అలా మొదటి రోజే సెన్సేషనల్ గా స్టార్ట్ అయిన ఈ సినిమా, రిలీజైన 2 రోజులకే మిలియన్ డాలర్ క్లబ్ (ప్రీమియర్స్ తో కలిపి)లోకి చేరింది.


సంక్రాంతి సీజన్ కావడం, సోమవారం కూడా హాలిడే కావడంతో, ఓవర్సీస్ లో ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. రికార్డ్ ఓపెనింగ్స్ దక్కాయి.


రెండో రోజు కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు ఏపీ,నైజాంలో 1500కు పైగా షోలతో దుమ్ముదులిపిన వాల్తేరు వీరయ్యకు, రెండో రోజు కూడా 700కు పైగా స్క్రీన్స్ దక్కాయి. వారసుడు రాకతో ఈ సినిమాకు షోలు కాస్త తగ్గినప్పటికీ, వసూళ్లు మాత్రం నిలకడగా ఉన్నాయి.


వాల్తేరు వీరయ్యకు పాజిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా సినిమా సెకెండాఫ్ క్లిక్ అవ్వడంతో ఈ సినిమా సంక్రాంతి విజేతగా నిలిచే అవకాశం ఉంది. బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించింది.

First Published:  15 Jan 2023 9:29 AM GMT
Next Story