Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: చిరంజీవి సినిమా సెన్సార్ పూర్తి

Waltair Veerayya: చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. రిలీజ్ కు రెడీ అవ్వడంతో, యూనిట్ కు చిరంజీవి గ్రాండ్ పార్టీ ఇచ్చారు.

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు
X

Waltair Veerayya Movie Collections: వాల్తేరు వీరయ్య మొదటి వారం వసూళ్లు

చిరంజీవి తాజా చిత్రం వాల్తేరు వీరయ్య. బాబి దర్శకుడు. మరో హీరో రవితేజ కీలక పాత్ర పోషించాడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారం పీక్ స్టేజ్ లో నడుస్తోంది. సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'వాల్తేరు వీరయ్య' తాజాగా సెన్సార్ కార్యక్రమాల్ని పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు అధికారికంగా లైన్ క్లియర్ అయింది.

చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయడంతో పాటు.. కథ-మాటలు కూడా అందించాడు బాబి. కోన వెంకట్, చక్రవర్తి కలిసి స్క్రీన్ ప్లే ఇచ్చారు. వాల్తేరు వీరయ్య జనవరి 13న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది.




First Published:  3 Jan 2023 5:30 AM GMT
Next Story