Telugu Global
Cinema & Entertainment

Waltair Veerayya: 115 సెంటర్లు.. 50 రోజులు

Chiranjeevi's Waltair Veerayya Movie 50 days: చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమా, 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది.

Waltair Veerayya: 115 సెంటర్లు.. 50 రోజులు
X

మెగాస్టార్ చిరంజీవితో కలసి మాస్ మహారాజా రవితేజ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం, టాలీవుడ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది.

సంక్రాంతి బరిలో భారీ ఓపెనింగ్స్ సాధించడంతో పాటు రోజురోజుకు కలెక్షన్లు పెరిగాయి. ఇదిలా ఉండగా, ఈ సినిమా ఈ రోజుతో 70 డైరెక్ట్ సెంటర్లలో, ఓవరాల్ గా 115 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తి చేసుకుంది. ఇది కచ్చితంగా గొప్ప విజయమే. ఈ కాలం ఓ సినిమా వందకు పైగా సెంటర్లలో 50 రోజులు ఆడడం చాలా పెద్ద విషయం.

వింటేజ్ మెగాస్టార్ ని చూపించడంతో పాటు, రవితేజను ఇంటెన్స్ క్యారెక్టర్‌లో ప్రజంట్ చేసి అందరి మనసుని గెలిచాడు దర్శకుడు బాబీ కొల్లి. ఈ సినిమాలో శ్రుతి హాసన్ హీరోయిన్ గా నటించింది.

మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని మెగా బడ్జెట్‌తో నిర్మించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది. త్వరలోనే ఓటీటీలో మెరవనుంది వాల్తేరు వీరయ్య సినిమా.

First Published:  3 March 2023 3:40 PM GMT
Next Story