Telugu Global
Cinema & Entertainment

Vrushabha Movie | పాన్ ఇండియా మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

Vrushabha Movie - వృషభ మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. మోహన్ లాల్ నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో, శ్రీకాంత్ కొడుకు రోషన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Vrushabha Movie | పాన్ ఇండియా మూవీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
X

మలయాళ సూపర్ స్టార్ మెహన్ లాల్, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న పాన్ ఇండియా మూవీ 'వృషభ'. 'ది వారియర్ అరైజ్' అనేది ట్యాగ్ లైన్. జహ్రా ఖాన్, శనయ కపూర్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

నంద కిషోర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఏకకాలంలో తెలుగు, మలయాళీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీని హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేయబోతోన్నారు.

జూన్ 22న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. తాజాగా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. ఈ షెడ్యూల్ లో లీడ్ ఆర్టిస్టులపై కొంత టాకీ పార్ట్ తో పాటు.. మోహన్ లాల్ పై భారీ యాక్షన్ సన్నివేశాలు తీశారు. బాహుబలి, మన్యం పులి, గజిని, రోబో, పుష్ప ది రైజ్ వంటి సినిమాలకు పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హెయిన్స్ ఈ సినిమాకు ఫైట్స్ డిజైన్ చేస్తున్నారు.

మన్యం పులి తర్వాత మోహన్ లాల్, పీటర్ హెయిన్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. తండ్రీ కొడుకుల మధ్య వచ్చే హై ఆక్టేన్ ఎమోషనల్ డ్రామాగా వృషభ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ఎమోషన్స్, వీఎఫ్ఎక్స్, యాక్షన్ సీక్వెన్స్ భారీ ఎత్తున చూపించబోతోన్నారు. వచ్చే ఏడాదిలో 'వృషభ' ను రిలీజ్ చేయబోతున్నారు.

First Published:  25 Aug 2023 5:54 AM GMT
Next Story