Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | బాలకృష్ణకు ఆ మేటర్ చెప్పకూడదనుకున్నాడట

Vishwak Sen - విశ్వక్ సేన్ ఓటీటీలోకి ఎంటరయ్యాడు. ఫ్యామిలీ ధమాకా అనే ఒరిజినల్ నాన్-ఫిక్షన్ షో చేశాడు. ఆహాలో వచ్చే నెల 8 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

Vishwak Sen | బాలకృష్ణకు ఆ మేటర్ చెప్పకూడదనుకున్నాడట
X

విశ్వక్ సేన్ హంగామా మొదలైంది. ఆహా ఓటీటీపై ఓ నాన్-ఫిక్షన్ షో చేస్తున్నాడు విశ్వక్. దీని పేరు ఫ్యామిలీ ధమాకా. సెప్టెంబ‌ర్ 8 నుంచి ఆహాలో ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. ప్ర‌తీ శుక్ర‌వారం రాత్రి 8 గంట‌ల‌కు ఈ షో నుంచి కొత్త ఎపిసోడ్ అంద‌రినీ ఆక‌ట్టుకోనుంది. ఈ షోను వీక్షించే ప్రేక్ష‌కుల్లో ఉత్తేజాన్ని పెంచేలా ఎన్నో భావోద్వేగాలు, స‌వాళ్ల క‌ల‌యిక‌గా ఓ రోల‌ర్ కోస్ట‌ర్‌లా మ‌న ముందుకు రానుంది.

అయితే ఇప్ప‌టివ‌ర‌కు మీరు చూసిన షోస్‌కు ఇదెంతో భిన్న‌మైనది. కుటుంబాల మ‌ధ్య అనుబంధాలను తెలియ‌జేస్తూనే అంద‌రినీ ఈ షో ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఈ షోతో టాలీవుడ్ హీరో విశ్వ‌క్ సేన్ హోస్ట్‌గా మారుతున్నాడు. నిజానికి ఇది ఒరిజినల్ షో కాదు. హాలీవుడ్ లో సూపర్ హిట్టయిన నాన్-ఫిక్షన్ షోకు రీమేక్ లాంటిది అనుకోవచ్చు.

ఈ విషయాన్ని హీరో విశ్వక్ సేన్ కూడా నిర్థారించాడు. ఇప్పటికే 26 దేశాల్లో ఈ షో సూపర్ హిట్టయింది. ఇప్పుడు ఇండియాలో తొలిసారిగా ఫ్యామిలీ ధమాకా పేరిట ఈ షోను ఆహాలో ప్రవేశపెడుతున్నారు. దీనికి సంబంధించి బాలయ్యతో జరిగిన చిన్న సంభాషణను గుర్తు చేసుకున్నాడు విశ్వక్.

"ఆహాలో ఫ్యామిలీ ధమాకా అనే షో చేస్తున్న విషయాన్ని బాలకృష్ణ గారికి చెప్పకూడదనుకున్నాను. షూటింగ్ చేసిన తర్వాత డైరక్ట్ గా ప్రోమో పంపిద్దామనుకున్నాను. కానీ ఈ గ్యాప్ లో అనుకోకుండా చిన్న యాక్సిడెంట్ అయింది. బాలయ్య ఫోన్ చేసి పరామర్శించారు. ఆ మాటల సందర్భాలో ఈ షో గురించి చెప్పేశాను. చాలా హ్యాపీ ఫీలయ్యారు. నా కడుపు కొడుతున్నావంటూ పెద్ద జోక్ కూడా వేశారు."

ఓవైపు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా చేస్తూనే, మరోవైపు ఈ ఓటీటీ షో కంప్లీట్ చేశాడు విశ్వక్ సేన్. సీజన్-1 క్లిక్ అయితే, సీజన్-2 కూడా వస్తుందని క్లారిటీ ఇచ్చాడు ఈ హీరో. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా డిసెంబర్ 8న రిలీజ్ అవుతుంది.

First Published:  28 Aug 2023 5:23 PM GMT
Next Story