Telugu Global
Cinema & Entertainment

తెలుగు తెరపైకి మరో మలయాళ రీమేక్

విశ్వక్ సేన్ మరో మలయాళ సినిమాను రీమేక్ చేశాడు. ఈసారి 'ఓరి దేవుడా' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తెలుగు తెరపైకి మరో మలయాళ రీమేక్
X

మలయాళ సినిమాలు తెలుగులోకి రీమేక్ అవ్వడం కొత్తేం కాదు. ఆమధ్య భీమ్లానాయక్ వచ్చింది. తాజాగా గాడ్ ఫాదర్ వచ్చింది. ఇవన్నీ మలయాళం రీమేకులే. ఇప్పుడీ లిస్ట్ లోకి మరో సినిమా రాబోతోంది. ఆ మూవీ పేరు ఓరి దేవుడా.

మలయాళంలో సూపర్ హిట్టయిన ఓ మై కడవులే సినిమాకు రీమేక్ ఇది. విశ్వక్ సేన్ హీరోగా నటించాడు. మలయాళం వెర్షన్ ను తీసిన అశ్వత్ మరిముత్తునే తెలుగు రీమేక్ కు కూడా దర్శకుడిగా తీసుకున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ను లాంఛ్ చేశారు.

ఇద్దరు హీరోయిన్లు, ఓ హీరోకు చెందిన కథ ఇది. ఇంకా చెప్పాలంటే ట్రయాంగిల్ లవ్ స్టోరీనే. కాకపోతే దీనికి కొన్ని కొత్త ఎలిమెంట్స్ యాడ్ చేశాడు దర్శకుడు. అవేంటనేది ఇప్పటికిప్పుడు చెప్పేస్తే కష్టం. బెస్ట్ ఫ్రెండ్ భార్యగా మారితే వైవాహిక జీవితం ఇబ్బందులు పాలవుతుందని టీజర్ లో చెప్పే ప్రయత్నం చేశారు.

ఎప్పట్లానే ఫ్రస్ట్రేషన్ తో కూడిన ప్రేమికుడి పాత్రలో విశ్వక్ సేన్ బాగా నటించాడు. హీరోయిన్లు ఆశా భట్, మిథిలా పాల్కర్ అందంగా కనిపించారు. వాళ్లకు సినిమాలో నటించే స్కోప్ కూడా దక్కినట్టు టీజర్ చూస్తే తెలుస్తోంది. కీలక పాత్రలో కనిపిస్తున్న వెంకటేశ్.. హుందాగా, హ్యాండ్సమ్ గా ఉన్నాడు. ఈనెల 21న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.



First Published:  8 Oct 2022 6:44 AM GMT
Next Story