Telugu Global
Cinema & Entertainment

Gangs of Godavari | విశ్వక్ సేన్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్

Vishwak Sen Gangs of Godavari - విశ్వక్ సేన్ కొత్త సినిమాకు టైటిల్ లాక్ చేశారు. ఈ మూవీకి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పేరు పెట్టారు. గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు.

Gangs of Godavari | విశ్వక్ సేన్ కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్
X

టాలీవుడ్ లో క్రేజీ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. ప్రస్తుతం ఈ హీరో తన 11వ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై చేస్తున్నాడు. కృష్ణ చైతన్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. కథారచయిత కూడా అతడే. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఓ క్రూరమైన ప్రపంచంలో సామాన్యుడి నుంచి సంపన్నుడిగా ఎదిగిన వ్యక్తిగా విశ్వక్ సేన్ ఈ చిత్రంలో కనిపించనున్నాడు. కొన్ని చోట్ల నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నాడు విశ్వక్. ఈ సినిమాలో అంజలి, 'రత్నమాల' అనే ఓ కీలక పాత్రలో నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. విశ్వక్ సేన్ 11వ చిత్రానికి 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే టైటిల్‌ పెట్టారు. ఈ మేరకు గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్ తో వస్తోంది ఈ సినిమా.

"మేము గోదారోళ్ళం.. మాట ఒకటే సాగదీస్తాం.. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం" అంటూ విశ్వక్ సేన్ చెప్పే పవర్ ఫుల్ డైలాగ్ తో గ్లింప్స్ ప్రారంభమైంది. విశ్వక్ సేన్ లుంగీ కట్టుకొని ఊర మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. రాత్రిపూట లారీల్లో అక్రమంగా సరకు తరలించడం, గోదావరి పరిసరాలు, యాక్షన్ సన్నివేశాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది ఈ గ్లింప్స్.

యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం బాగుంది. ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాలో గోదావరి యాసలో మాట్లాడబోతున్నాడు విశ్వక్ సేన్. తెలంగాణకు చెందిన ఈ హీరో, గోదావరి యాసలో ఎలా మెప్పించాడో చూడాలి.

First Published:  31 July 2023 11:53 AM GMT
Next Story