Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | విశ్వక్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే?

Vishwak Sen's new movie - సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోంది విశ్వక్ సేన్ కొత్త సినిమా. ఇప్పుడీ సినిమాకు టైటిల్ లాక్ చేశారు.

Vishwak Sen | విశ్వక్ కొత్త సినిమా టైటిల్ రిలీజ్ ఎప్పుడంటే?
X

సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు విశ్వక్ సేన్. డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాతో రవితేజ ముళ్లపూడి దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతోంది.

తాజాగా మొదటి షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే రెండో షెడ్యూల్ మొదలవుతుంది. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఇప్పుడీ సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా టైటిల్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు.

ఆగస్ట్ 6 ఉదయం 11 గంటల 11 నిమిషాలకు విశ్వక్ సేన్ కొత్త సినిమా టైటిల్ ను ప్రకటిస్తారు. అదే రోజు సినిమా నుంచి గ్లింప్స్ ను కూడా విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ లో విశ్వక్ సేన్ ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నాడు. అంతేకాదు, సరికొత్తగా మేకోవర్ కూడా అయ్యాడు.

ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌ని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నాడు.

First Published:  25 July 2023 2:38 PM GMT
Next Story