Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | విశ్వక్ సేన్ కొత్త సినిమా షూట్ అప్ డేట్స్

Vishwak Sen - కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. మూవీకి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. షూటింగ్ అప్ డేట్స్ చూద్దాం

Vishwak Sen | విశ్వక్ సేన్ కొత్త సినిమా షూట్ అప్ డేట్స్
X

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తన కొత్త చిత్రాన్నిచేస్తున్నారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది.

తాజాగా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తయింది. చిత్ర ప్రధాన తారాగణం అంతా ఈ షెడ్యూల్ లో పాల్గొన్నారు. త్వరలో తదుపరి షెడ్యూల్‌ను యూనిట్ ప్రారంభించనుంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

షెడ్యూల్ పూర్తయిన సందర్భంగా, హీరోయిన్ మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. సంప్రదాయబద్ధంగా, అందంగా కనిపిస్తోంది మీనాక్షి. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ లిరికల్ వీడియో కూడా త్వరలో రివీల్ కానుంది. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు.

ఫన్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. మనోజ్ కాటసాని కెమెరామెన్ గా పని చేస్తున్నాడు. దాస్ కా ధమ్కీ తర్వాత విశ్వక్ సేన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో.. ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. త్వరలోనే సినిమా టైటిల్ ను ఎనౌన్స్ చేస్తారు.

First Published:  21 July 2023 11:03 AM GMT
Next Story