Telugu Global
Cinema & Entertainment

దీపావళికి దమ్మీ

దాస్ కా దమ్కీ అనే సినిమా తీస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమాలో హీరోగా నటించడంతో పాటు తనే దర్శకత్వం వహిస్తున్నాడు. నిర్మాత కూడా అతడే.

దీపావళికి దమ్మీ
X

యంగ్ హీరో విశ్వక్ సేన్, ఫలక్‌నుమా దాస్‌ మూవీతో తన దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నాడు. హీరోగా ప్రధాన పాత్రలో నటించడంతో పాటు,.. దర్శకత్వం కూడా చేసి పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి తన స్వీయదర్శకత్వంలో, హీరోగా నటిస్తూ సినిమా చేస్తున్నాడు. ఆ మూవీ పేరు 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ కథ, మాటలు అందించాడు. నివేత పేతురాజ్ హీరోయిన్.

దాస్ కా ధమ్కిలో అన్నీ ఉన్నాయంటున్నాడు విశ్వక్. రొమాన్స్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్.. ఇలా అన్ని ఎలిమెంట్స్ కవర్ అవుతాయంటున్నాడు. తెలుగు ప్రేక్షకులకు తన సినిమా ఓ కొత్త అనుభూతిని ఇస్తుందట. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇందులోని యాక్షన్ సీక్వెన్సెస్ కొత్త థ్రిల్స్‌ అందిస్తాయని చెబుతున్నాడు.

95 శాతం చిత్రీకరణ పూర్తిచేసుకుంది ఈ సినిమా. మిగిలిన భాగాన్ని ఒక వారంలో పూర్తి చేస్తారు. ఆర్‌ఆర్‌ఆర్‌, హరి హర వీర మల్లు చిత్రాలకు స్టంట్ కొరియోగ్రఫీ చేసిన బల్గేరియన్ ఫైట్ మాస్టర్స్ టోడర్ లాజరోవ్-జుజి తో చిత్ర బృందం సినిమా క్లైమాక్స్ ఫైట్‌ ను షూట్ చేస్తోంది. హైదరాబాద్‌ లోని సారధి స్టూడియోస్‌ లో వేసిన భారీ సెట్‌ లో ఈ షూటింగ్ జరుగుతోంది.

ఫుకెట్‌ లో ఒక నెల షూటింగ్ షెడ్యూల్‌ ను, స్పెయిన్‌ లో ఒక చిన్న షెడ్యూల్‌ ను టీమ్ పూర్తి చేసుకుంది. దీపావళి కి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ని విడుదల చేసి ప్రమోషన్స్‌ను అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. విశ్వక్ సేన్ కెరీర్ లో తొలి పాన్ ఇండియా సినిమా ఇదే.

First Published:  4 Sep 2022 7:07 AM GMT
Next Story