Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen - విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్

Vishwak Sen's new movie - సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కొత్త సినిమా చేస్తున్నాడు విశ్వక్ సేన్. ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

Vishwak Sen - విశ్వక్ సేన్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
X

విశ్వక్ సేన్ హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై ఓ సినిమా తెరకెక్కుతోంది. నైతికత లేని సమాజంలో నెగెటివ్ షేడ్స్ తో పెరిగిన ఓ వ్యక్తి జీవిత ప్రయాణాన్ని చెప్పే సినిమా ఇది. విశ్వక్ సేన్ కెరీర్ లో 11వ చిత్రం ఇది. ఇంకా పేరు పెట్టలేదు.

క్రూరమైన ప్రపంచంలో అట్టడుగు స్థాయి నుంచి ధనవంతుడిగా ఎదిగిన ఓ వ్యక్తి కథ ఇది. నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా, ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇప్పటికే విడుదలైన గంగానమ్మ జాతర పోస్టర్ సినిమాపై ఆసక్తిని, అంచనాలను పెంచింది. ఇక ఇప్పుడు నివాళిగా విడుదల చేసిన పోస్టర్ తెలుగువారి హృదయాలను హత్తుకునేలా ఉంది. పోస్టర్ లో తన రఫ్ లుక్ తో ఆకట్టుకుంటున్నాడు విశ్వక్. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. భారీస్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నాడు. తన కెరీర్ లో ఇదో విభిన్న చిత్రం అవుతుందంటున్నాడు విశ్వక్.

First Published:  28 May 2023 12:11 PM GMT
Next Story