Telugu Global
Cinema & Entertainment

Mechanic Rocky | విశ్వక్ నుంచి మరో మూవీ

Mechanic Rocky - విశ్వక్ సేన్ తాజా చిత్రం మెకానిక్ రాకీ. ఈ సినిమాకు విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Mechanic Rocky | విశ్వక్ నుంచి మరో మూవీ
X

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తన రాబోయే మూవీలో మెకానిక్ రాకీగా మెప్పించబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను.. ఎస్ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నాడు.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా మేకర్స్ విడుదల తేదీ ప్రకిటంచారు. మెకానిక్ రాకీ చిత్రాన్ని అక్టోబర్ 31 న దీపావళి కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు.

ఈ సినిమా రిలీజ్ కు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజ్ అవుతుంది. అందుకే సినిమాను గురువారం రోజున విడుదల చేస్తున్నారు. ఇక రిలీజ్ డేట్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ తుపాకీ పట్టుకున్నాడు. మరో చేతిలో రెంచ్ ఉంది.

ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నాడు. మనోజ్ కటసాని డీవోపీగా వ్యవహరిస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు రిలీజ్ చేశాడు విశ్వక్. అయితే సరైన విజయం అందుకోలేకపోయాడు. దీంతో మెకానిక్ రాకీ సినిమాపై ఒత్తిడి పెరిగింది.

First Published:  19 July 2024 4:03 PM GMT
Next Story