Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen | మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్

Vishwak Sen - విశ్వక్ సేన్ హీరోగా మెకానిక్ రాకీ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజైంది.

Vishwak Sen | మెకానిక్ రాకీ ఫస్ట్ లుక్
X

గామి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విశ్వక్ సేన్ వరుసపెట్టి సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నాడు. అతడి నటిస్తున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి త్వరలోనే థియేటర్లలోకి రానుంది. ఇప్పుడు మెకానిక్ రాకీ అనే సినిమాను కూడా రెడీ చేస్తున్నాడు.


తన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశాడు విశ్వక్. కెరీర్ లో విశ్వక్ కు ఇది 10వ చిత్రం. ఈ చిత్రానికి 'మెకానిక్ రాకీ' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు.


టైటిల్ పోస్టర్ ని క్రియేటివ్ గా డిజైన్ చేసారు. పోస్టర్ లో రాకీగా విశ్వక్ లుక్ ను మనం చూడవచ్చు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో విశ్వక్ సేన్ మాస్ ను పవర్ ఫుల్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు. చేతిలో పెద్ద రెంచ్‌తో సిగరెట్ తాగుతూ కొంటె చూపుతో కనిపించారు. బ్యాక్‌గ్రౌండ్‌లో మెకానిక్‌ షెడ్‌ని మనం చూడవచ్చు.


చూడ్డానికి యాక్షన్ లుక్ లో ఉన్నప్పటికీ, సినిమాలో మంచి కామెడీ ఉందంటున్నాడు విశ్వక్. కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  30 March 2024 4:58 PM GMT
Next Story