Telugu Global
Cinema & Entertainment

Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రయిలర్ రివ్యూ

Gangs of Godavari - గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రయిలర్ లాంచ్ అయింది. మాస్ అంశాలు ఏ రేంజ్ లో ఉన్నాయో, బూతులు కూడా అదే విధంగా ఉన్నాయి.

Gangs of Godavari | గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రయిలర్ రివ్యూ
X

విశ్వక్ సేన్ తాజా చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి". సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకుడు. నేహా శెట్టి హీరోయిన్. నటి అంజలి కీలక పాత్రలో కనువిందు చేయనుంది. భారీ అంచనాలతో మే 31వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు నిర్మాతలు.

"గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" సినిమా ట్రైలర్ ను హైదరాబాద్‌లోని దేవి 70 ఎంఎం థియేటర్‌లో అభిమానుల కేరింతల మధ్య విడుదల చేశారు. "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" చిత్రం ఘన విజయం సాధించడమే కాకుండా, తన కెరీర్ లో ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలుస్తుందని అన్నాడు విశ్వక్ సేన్.

"లంకల రత్న" అనే శక్తివంతమైన పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తున్నాడు. ఆ పాత్రలో ఆయన ఒదిగిపోయిన తీరు అమోఘం. తనదైన ఆహార్యం, అభినయంతో పాత్రకు నిండుదనం తీసుకొచ్చాడు. "లంకల రత్న" పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటుంది అనడంలో సందేహం లేదు. సామాన్యుడి నుండి అసామాన్యుడిగా ఎదిగిన ఆ పాత్ర ప్రయాణం ఎలా ఉండబోతుందో చూపించిన తీరు.. సినిమా పట్ల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది.

ఆకట్టుకునే పోరాట సన్నివేశాలు, బలమైన భావోద్వేగాలతో ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. మనుషులను మూడు వర్గాలుగా వివరించే పాత్రతో ట్రైలర్ ప్రారంభమైతే, కథానాయకుడు వారిని "మగ", "ఆడ" మరియు "రాజకీయ నాయకులు"గా వర్గీకరించడంతో ముగుస్తుంది. యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరింది.

First Published:  25 May 2024 6:06 PM GMT
Next Story