Telugu Global
Cinema & Entertainment

Gangs of Godavari | మరో విడుదల తేదీ

Gangs of Godavari - గతేడాది నుంచి వాయిదాల మీద వాయిదాలు పడుతోంది గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా. ఇప్పుడీ మూవీకి మరో విడుదల తేదీ ఫిక్స్ చేశారు.

Gangs of Godavari | మరో విడుదల తేదీ
X

డిఫరెంట్ పాత్రలు, కథలకు కేరాఫ్ గా మారాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా వచ్చిన 'గామి'లో అఘోరాగా కనిపించిన ఈ నటుడు, ఇప్పుడు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' అనే సినిమాలో మరో వైవిధ్యమైన పాత్రతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.

తాజాగా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఈ చిత్రాన్ని మే 17న వేసవి సెలవులకు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది.

ఈ చిత్రంలో అందాల నటి నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా, అంజలి కీలక పాత్రలో కనిపించనుంది. 1960 లలో గోదావరి జిల్లాలలో చీకటి ప్రపంచంలో సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా ఎదిగిన హింసాత్మక పాత్రలో విశ్వక్ సేన్ కనిపిస్తాడు.

ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటికే ఆయన స్వరపరిచిన ఆల్బమ్ నుండి విడుదలైన ''సుట్టంలా సూసి'' మెలోడీ సాంగ్ విశేషంగా ఆకట్టుకుంది. ఈ పాట యూట్యూబ్‌లో 48 మిలియన్ కి పైగా వ్యూస్‌ సాధించి, సినిమా పట్ల ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేసింది.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ సినిమాకి కృష్ణచైతన్య రచన, దర్శకత్వం వహిస్తున్నాడు.

First Published:  17 March 2024 8:59 AM GMT
Next Story