Telugu Global
Cinema & Entertainment

Gaami | డిఫరెంట్ లుక్ లో విశ్వక్ సేన్

Gaami Movie - విశ్వక్ సేన్ చేస్తున్న ప్రయోగాత్మక చిత్రం గామి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఈరోజు రిలీజైంది.

Gaami | డిఫరెంట్ లుక్ లో విశ్వక్ సేన్
X

హీరో విశ్వక్ సేన్ కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌లు చేయడంతో పాటు అప్పుడప్పుడు ప్రయోగాలు కూడా చేస్తుంటాడు. గామి సినిమా అలాంటిదే. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'గామి'. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'వి సెల్యులాయిడ్' సమర్పిస్తున్న ఈ సినిమాను క్రౌండ్ ఫండింగ్ చేసి నిర్మించారు.

తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. అలా గామి ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టారు. ఫస్ట్ లుక్ లో అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్ టెర్రిఫిక్ గా ఉంది. ఇదొక అడ్వెంచరస్ డ్రామా మూవీ.

ఈ చిత్రంలో విశ్వక్ సేన్ 'శంకర్' అనే అఘోరాగా కనిపించనున్నారు. తనకి చాలా రేర్ కండీషన్ ఉంటుంది. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు. మనిషి స్పర్మ అతడి అతిపెద్ద భయం, అతిపెద్ద కోరిక కూడా అదే. ఇదే వాక్యాన్ని పోస్టర్ లో కూడా పెట్టారు.

కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి హీరోయిన్ గా నటించగా.. అభినయ, హారిక కీలక పాత్రలు పోషించారు. నరేష్ కుమారన్ సంగీతం అందించాడు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తారు.

First Published:  28 Jan 2024 4:43 PM GMT
Next Story