Telugu Global
Cinema & Entertainment

Gaami | మొదటి వారాంతం మెరిసిన గామి

Gaami Movie - విశ్వక్ సేన్ హీరోగా నటించిన గామి సినిమా రిలీజై 3 రోజులైంది. మొదటి వారాంతానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయింది.

Gaami | మొదటి వారాంతం మెరిసిన గామి
X

విశ్వక్ సేన్ మరో హిట్ కొట్టాడు. గామి సినిమా దిగ్విజయంగా ఫస్ట్ వీకెండ్ పూర్తి చేసుకుంది. మొదటి 3 రోజులకే హిట్ అని ఎలా చెబుతాం? ఇదేగా మీ అనుమానం. దీనికి సమాధానం ఉంది. అదేంటంటే.. గామి సినిమా విడుదలైన 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఈరోజు నుంచి ఈ సినిమాకు వచ్చే వసూళ్లన్నీ లాభం కిందే లెక్క. సో.. బయ్యర్లంతా సేఫ్ అయినట్టే. కాబట్టి గామి సినిమా హిట్టయినట్టే.

విశ్వక్ సేన్, చాందినీ చౌదరి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ ప్రయోగాత్మక సినిమాకు మొదటి రోజు 9 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. 3 రోజులు గడిచేసరికి ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చింది. తాజా వసూళ్లతో తమ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.

అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు రాబడుతోంది. ఇప్పటికే 4 లక్షల డాలర్లు ఆర్జించిన ఈ మూవీ, రేపటికి హాఫ్-మిలియన్ డాలర్ మార్క్ కు చేరుకోబోతోంది. విద్యాధర్ కాగిత డైరక్ట్ చేసిన ఈ సినిమా నిడివి చాలా పెద్దగా ఉంది. రిస్క్ లో రిస్క్ ఎందుకనే ఉద్దేశంతో.. సెన్సార్ వెర్షన్ నుంచి 17 నిమిషాలు కట్ చేసి, ట్రిమ్ చేసిన వెర్షన్ ను విడుదల చేశారు.

ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడంతో, అలా కట్ చేసిన 17 నిమిషాల క్లిప్పింగ్స్ కలిపి, త్వరలోనే ఓటీటీలో విడుదల చేయబోతున్నారు. గామి తర్వాత కొన్నాళ్ల పాటు ప్రయోగాలు చేయనని ప్రకటించాడు విశ్వక్ సేన్. ఇప్పుడీ సినిమా విజయంతో, అతడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడేమో చూడాలి.

First Published:  11 March 2024 5:18 PM GMT
Next Story