Telugu Global
Cinema & Entertainment

Vishwak Sen Dhamki: ధమ్కీ విడుదల తేదీ ఫిక్స్

Vishwak Sen's Dhamki: ధమ్కీ మూవీకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశాడు విశ్వక్ సేన్. డిసెంబర్ లో రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశాడు.

Vishwak Sen Dhamki: ధమ్కీ విడుదల తేదీ ఫిక్స్
X

హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న దాస్ కా ధమ్కీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. దీనికి సంబంధించి అనౌన్స్ మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తూ విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న సినిమా 'దాస్ కా ధమ్కీ'. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్ల పై తన తండ్రి కరాటే రాజుతో కలిసి విశ్వక్ సేన్ నిర్మిస్తున్న సినిమా ఇది. నివేత పెతురాజ్ ఇందులో హీరోయిన్.

ఈ చిత్రానికి ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇటీవల, మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ 1.0కి మంచి స్పందన వచ్చింది. యాక్షన్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ సినిమాకు లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.




First Published:  25 Nov 2022 4:30 AM GMT
Next Story