Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki: ఫిబ్రవరికి వాయిదాపడిన విశ్వక్ సేన్ సినిమా

స్వీయ దర్శకత్వంలో నటిస్తూ విశ్వక్ సేన్ తెరకెక్కిస్తున్న సినిమా దాస్ కా దమ్కీ. ఈ సినిమా షూటింగ్ కొలిక్కి వచ్చింది. తాజాగా ఫస్ట్ లుక్ కూడా రిలీజైంది.

Das Ka Dhamki: ఫిబ్రవరికి వాయిదాపడిన విశ్వక్ సేన్ సినిమా
X

ఫలక్‌నుమా దాస్‌తో తన డైరక్షన్ టాలెంట్ చూపించిన విశ్వక్ సేన్, ఇప్పుడు మరోసారి మెగాఫోన్ పట్టాడు. తనే హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో 'దాస్ కా ధమ్కీ' తీస్తున్నాడు. వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నివేదా పేతురాజ్ హీరోయిన్.

'దాస్ కా ధమ్కీ' ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో విశ్వక్ సేన్ చెవిపోగులు, గడియారం ధరించి స్టైలిష్, రగ్డ్ లుక్‌లో కనిపించాడు. తన కనుబొమ్మలను పైకెత్తి ఎవరికో ధమ్కీ ఇస్తున్నట్లుగా చూస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తే ఇదొక యాక్షన్ మూవీ అనే ఫీలింగ్ కలుగుతోంది.

కానీ 'దాస్ కా ధమ్కీ' ఈ సినిమాలో రొమాన్స్, కామెడీ కూడా ఉంటాయట. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ తో పాటు భారీ యాక్షన్‌ ఉంటుందట. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది. ఈ వారం చివరికల్లా ప్రొడక్షన్ మొత్తం పూర్తవుతుంది.

ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్నాడు. రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ వచ్చే ఏడాది ఫిబ్రవరికి వాయిదా వేశారు. ఫిబ్రవరిలో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమా రిలీజ్ అవుతుంది. విశ్వక్ కు ఇది తొలి పాన్ ఇండియా మూవీ కానుంది.




First Published:  18 Nov 2022 6:17 AM GMT
Next Story