Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki: దాస్ కా దమ్కీ ఫస్ట్ సాంగ్ బాగుంది

Das Ka Dhamki: విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న సినిమా దాస్ కా దమ్కీ. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజైంది. సూపర్ హిట్టయింది.

Das Ka Dhamki: దాస్ కా దమ్కీ ఫస్ట్ సాంగ్ బాగుంది
X

హీరో విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ' టైటిల్ రోల్ పోషిస్తుండటంతో పాటు దర్శకత్వం వహిస్తున్నాడు ఈ హీరో. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన 'దాస్ కా ధమ్కీ' థియేట్రికల్ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నంబర్‌ తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్స్ ప్రారంభించారు.

హిందీ వెర్షన్ 'ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా' పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల' పాటను సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశాడు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్ లో షూట్ చేసిన విజువల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌ లు, నివేదా పేతురాజ్ గ్లామర్ టచ్ థియేటర్లలో ప్రేక్షకులను కట్టిపడేస్తాయంటున్నారు మేకర్స్. లియోన్ జేమ్స్ , ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించాడు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయబోతున్నారు.


First Published:  7 Dec 2022 12:30 PM GMT
Next Story