Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki - వరుసగా రెండో పాటతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్

Vishwak Sen's Das Ka Dhamki - దాస్ కా దమ్కీ రెండో సాంగ్ రిలీజైంది. ఇలా రిలీజై, అలా హిట్టయింది.

Das Ka Dhamki - వరుసగా రెండో పాటతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్
X

విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా చిత్రం 'దాస్ కా ధమ్కీ'. ఈ సినిమాకు హీరో, దర్శకుడు, నిర్మాత ఇతడే. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడిగా నివేదా పేతురాజ్ నటిస్తోంది.

ఫస్ట్ సింగిల్ "ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల"కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో సినిమా మ్యూజికల్ ప్రమోషన్‌లు గ్రాండ్ గా మొదలయ్యాయి. ఈ వీడియో సాంగ్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రోజు, మేకర్స్ సెకండ్ సింగిల్ మావాబ్రో లిరికల్ వీడియోను విడుదల చేశారు.

ఇది రామ్ మిరియాల స్పెషల్. స్టార్ సింగర్ లైవ్లీ బీట్‌లతో పెప్పీ నంబర్‌ను స్కోర్ చేశాడు. అతని వాయిస్ కూడా లవ్లీ గా ఉంది. నిజానికి, రామ్ మిరియాల వాయిస్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లింది. ట్యూన్ క్యాచీగా ఉంది, కాసర్ల శ్యామ్ సాహిత్యం బాగుంది.

విశ్వక్ సేన్ ఈ పాటలో లైవ్లీగా కనిపించాడు. అతని డ్యాన్స్ చూడటానికి ట్రీట్‌గా ఉంది. ఆల్బమ్ నుంచి మరో బ్లాక్ బస్టర్ సాంగ్ అందుకున్నాడు విశ్వక్.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. కథ కూడా అతడే అందించాడు.

ఈ చిత్రానికి దినేష్ కె బాబు సినిమాటోగ్రఫర్ గా, లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, అన్వర్ అలీ ఎడిటర్ గా పని చేస్తున్నారు.

తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఫిబ్రవరి 17న థియేటర్లలోకి వస్తోంది ఈ సినిమా.



First Published:  20 Jan 2023 4:09 PM GMT
Next Story