Telugu Global
Cinema & Entertainment

Das Ka Dhamki - దాస్ కా ధమ్కీ నుంచి మరో సాంగ్ రిలీజ్

Vishwak Sen's Das Ka Dhamki - ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన 2 పాటలూ సూపర్ హిట్టయ్యాయి. ఇప్పుడు మూడో సాంగ్ వచ్చింది.

Das Ka Dhamki - దాస్ కా ధమ్కీ నుంచి మరో సాంగ్ రిలీజ్
X

విశ్వక్ సేన్ తొలి పాన్ ఇండియా మూవీ 'దాస్ కా ధమ్కీ'. విశ్వక్ ఈ సినిమాలో హీరో మాత్రమే కాదు, దర్శకుడు, నిర్మాత కూడా. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడీగా నివేదా పెతురాజ్ నటిస్తోంది.

ఇప్పటివరకూ విడుదలైన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్ల, మావాబ్రో పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. 'దాస్ కా ధమ్కీ' ట్రైలర్ కూడా ట్రెండ్ అయ్యింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘ఓ డాలరు పిలగా’ పాటని విడుదల చేశారు మేకర్స్,

లియోన్ జేమ్స్ ఈ పాటని పెప్పీ పబ్ నెంబర్ గా క్యాచీగా కంపోజ్ చేశారు. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఈ పాటని తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు సింగర్ మంగ్లీ. ఈ పాటలో విశ్వక్ లుక్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. రావు రమేష్, థర్టీ ఇయర్స్ పృథ్వీ కూడా ఈ పాటలో సందడి చేస్తూ కనిపించారు.

వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్ రాశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో రావు రమేష్, హైపర్ ఆది, రోహిణి, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య తారాగణం. ఈ నెల్లోనే సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.



First Published:  7 March 2023 12:16 PM GMT
Next Story