Telugu Global
Cinema & Entertainment

Das ka Dhamki - రెండో ట్రయిలర్ లో కథ చెప్పేశాడు

Vishwak Sen's Das ka Dhamki - దాస్ కా ధమ్కీ సినిమా నుంచి రెండో ట్రయిలర్ వచ్చేసింది. ఈసారి కాస్త కథ టచ్ చేశారు.

Das ka Dhamki - రెండో ట్రయిలర్ లో కథ చెప్పేశాడు
X

దాస్ కా ధమ్కీ మొదటి ట్రయిలర్ ఆల్రెడీ పెద్ద హిట్టయింది. ఇప్పుడు సరిగ్గా విడుదలకు 10 రోజుల ముందు రెండో ట్రయిలర్ రిలీజ్ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించి మరీ ఆర్భాటంగా ట్రయిలర్ లాంఛ్ చేశారు. ఈ రెండో ధమ్కీ ఎలా ఉందో చూద్దాం

మొదటి ట్రయిలర్ లో కథ, నేపథ్యాన్ని టచ్ చేయలేదు. కేవలం విజువల్స్, డైలాగ్స్ మీద ఆధారపడ్డారు. రెండో ట్రయిలర్ లో మాత్రం కథను కాస్త టచ్ చేశారు. విశ్వక్ సేన్ ద్విపాత్రాభినయం చేశాడనే విషయాన్ని చెప్పడంతో పాటు.. మరో పాత్ర స్థానంలో ఇంకో విశ్వక్ సేన్ సీన్ లోకి ఎంటర్ అవుతాడనే విషయాన్ని కూడా చూపించారు.

Advertisement

ఒక పాత్ర స్థానంలోకి మరో పాత్ర ప్రవేశించడం లాంటి క్యారెక్టర్లను రౌడీ అల్లుడు సినిమా నుంచి చూస్తూనే ఉన్నాం. మరి దాస్ కా ధమ్కీలో విశ్వక్ కొత్తగా ఏం చూపించాడనేది ఆసక్తికరం.

స్వీయ దర్శకత్వంలో విశ్వక్ హీరోగా నటించిన సినిమా ఇది. ఈ మూవీకి అతడే నిర్మాత. బెజవాడ ప్రసన్నకుమార్ డైలాగ్స్ రాసిచ్చాడు. జేమ్స్ లియోన్ మ్యూజిక్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. 22న థియేటర్లలోకి వస్తోంది థమ్కీ.



Next Story